ఇలాంటి మంచి సినిమాలు మరిన్ని తీయాలి: శర్వానంద్‌ | Sharwanand Speech in Youth Movie Success Meet | Sakshi
Sakshi News home page

ఇలాంటి మంచి సినిమాలు మరిన్ని తీయాలి: శర్వానంద్‌

Mar 29 2026 4:09 AM | Updated on Mar 29 2026 4:09 AM

Sharwanand Speech in Youth Movie Success Meet

శర్వానంద్, కెన్‌ కరునాస్‌

కెన్‌ కరునాస్, అనిష్క అనిల్‌ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్‌ వెంజరముడు, ప్రియాన్షీ యాదవ్, మీనాక్షీ దినేష్‌ ప్రధాన నటించిన తమిళ సినిమా ‘యూత్‌’. కెన్‌ కరునాస్‌ అండ్‌ గ్యాంగ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళనాడులో ఈ నెల 19న విడుదలైంది. ఈ చిత్రాన్ని ఈ2సీ పతాకంపై హౌస్‌ఫుల్‌ వినీత్, సందీప్‌  ఈ నెల 27న తెలుగులో రిలీజ్‌ చేశారు. తెలుగులో ‘యూత్‌’ చిత్రానికి మంచి స్పందన లభిస్తోందని యూనిట్‌ పేర్కొంది.

శనివారం జరిగిన ఈ సినిమా సక్సెస్‌మీట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన శర్వానంద్‌ మాట్లాడుతూ–‘‘యూత్‌’ సినిమాలో ఒక 23 ఏళ్ల అబ్బాయి హీరోగా నటించడంతోపాటు దర్శకత్వం వహించి సూపర్‌ హిట్‌ కొట్టాడంటే నమ్మలేకపోయాను. ఇలాంటి మంచి మూవీస్‌ మరిన్ని చేయాలి’’ అని అన్నారు.  ‘‘ఈ సినిమాలో నేను ప్రభాస్‌గారి ఫ్యాన్‌గా నటించాను. ఆయన ఫ్యాన్స్‌ మా సినిమాను సపోర్ట్‌ చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు కంటెంట్‌ ముఖ్యమని మరోసారి నిరూపించారు. మీ ఫ్యామిలీతో ఈ సినిమా చూడండి’’ అన్నారు కెన్‌ కరునాస్‌.

‘‘మా మార్కెటింగ్‌ సంస్థ పేరు హౌస్‌ఫుల్‌. ఇప్పుడు మా సినిమాకు హౌస్‌ఫుల్‌ బోర్డులు చూస్తుండటం సంతోషంగా ఉంది. పిల్లలు తమ తల్లిదండ్రుల్ని, తల్లిదండ్రులు తమ పిల్లల్ని అర్థం చేసుకోవాలనే కాన్సెప్ట్‌తో తీసిని సినిమా ఇది’’ అన్నారు సందీప్‌. ‘‘మా సినిమాను సపోర్ట్‌ చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు’’ అని తెలిపారు వినీత్‌. ఎగ్జిక్యూటివ్‌ ్రపొడ్యూసర్‌ సతీష్, దర్శకుడు వశిష్ట, నిర్మాత – డిస్ట్రిబ్యూటర్‌ ధీరజ్‌ మొగిలినేని మాట్లాడారు.
 

Advertisement
 
Advertisement
Advertisement