షారూఖ్‌ ఖాన్‌కు అత్యవసర శస్త్రచికిత్స.. అమెరికా పయనం | Shah Rukh Khan Went US For Surgery? | Sakshi
Sakshi News home page

షారూఖ్‌ ఖాన్‌కు అత్యవసర శస్త్రచికిత్స.. అమెరికా పయనం

Jul 30 2024 9:30 AM | Updated on Jul 30 2024 9:58 AM

Shah Rukh Khan Went US For Surgery?

బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్‌ ఖాన్‌ అమెరికా వెళ్లనున్నారు. కొద్దిరోజుల క్రితమే లండన్‌ నుంచి ఇండియాకు వచ్చిన షారూఖ్‌.. ఇప్పుడు తన ఆపరేషన్‌ కోసం అమెరికా వెళ్తున్నట్లు బీ టౌన్‌లో ఓ వార్త వైరల్‌ అవుతుంది. షారూఖ్‌ ఖాన్‌ గత కొద్దిరోజులుగా తన కంటికి సంబంధించిన సమస్యతో ఇబ్బంది పడుతున్నారట. దీంతో రీసెంట్‌గా ముంబైలోని ఆసుపత్రిలో సంప్రదించగా శస్త్రచికిత్స చేయాలని సూచించారట. దీంతో ఆయన మెరుగైన వైద్యం కోసం నేడు అమెరికా వెళ్తున్నట్లు సమాచారం.

2014 సమయంలో షారూఖ్‌ ఖాన్‌ కంటికి సంబంధించిన ఆపరేషన్‌ చేపించుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే తెలిపారు. సుమారు పదేళ్ల తర్వాత మళ్లీ కంటికి సంబంధించిన సమస్య రావడంతోనే అత్యవసరంగా ఆమెరికా వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నారు. అయితే, షారూఖ్ ఆరోగ్య పరిస్థితి గురించి మేనేజర్‌ పూజా దద్లానీ నుంచి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు.

అమెరికాకు షారూఖ్‌ ఖాన్‌ వెంట సతీమణి గౌరీఖాన్‌, కుమారుడు ఆర్యన్ ఖాన్‌ కూడా  వెళ్లనున్నట్టు తెలుస్తోంది. మరో మూడు రోజుల్లో ఆయనకు శస్త్రచికిత్స జరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది ఐపీఎల్‌ మ్యాచ్ సందర్భంగా షారుఖ్‌ఖాన్ వడదెబ్బకు లోను కావడంతో అహ్మదాబాద్‌లోని ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు ఇలాంటి వార్త బయటకు రావడంతో ఆయన అభిమానుల్లో ఆందోళన మొదలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement