తిరుమలలో షారుక్‌, నయనతార- విఘ్నేష్ శివన్ జంట | Shah Rukh Khan Visits Tirupati With Daughter Suhana And Nayanthara - Sakshi
Sakshi News home page

Tirumala: తిరుమలలో షారుక్‌, నయనతార- విఘ్నేష్ శివన్ జంట

Published Tue, Sep 5 2023 12:12 PM

Shah Rukh Khan Visits Tirupati With Daughter Suhana And Nayanthara - Sakshi

బాలీవుడ్‌ కింగ్‌ షారుక్ ఖాన్‌ నటించిన 'జవాన్‌' సినిమా సెప్టెంబర్‌ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో నేడు తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని షారుక్ ఖాన్‌తో పాటు ఆయన  కుమార్తె సుహానా ఖాన్ దర్శించుకున్నారు. వారితో పాటు హీరోయిన్‌ నయనతార, విఘ్నేష్‌ శివన్‌ ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు షారుక్‌ ఖాన్‌కు స్వాగతం పలికి స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. జమ్మూలోని వైష్ణో దేవి ఆలయాన్ని కూడా ఈ మధ్యే షారుఖ్‌ దర్శించుకున్న విషయం తెలిసిందే.. తిరుమల ఆలయ సంప్రదాయ దుస్తుల్లో తెల్లటి పంచె, షర్ట్‌ను షారుఖ్‌ ధరించగా.. తన కూతురు  సుహానా ఖాన్ కూడా తెల్లటి చుడీదార్‌లో మెరిశారు. అలాగే నటి నయనతార- విఘ్నేష్ శివన్ దంపతులు కూడా తెల్లటి దుస్తుల్లో ఉన్నారు.

(ఇదీ చదవండి: బిగ్‌ బాస్‌లో అత్యధిక రెమ్యునరేషన్‌ ఎవరికో తెలుసా..?)

OTT విడుదల వివరాలు
షారుక్ ఖాన్ నటించిన జవాన్ సెప్టెంబర్ 7న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా 7 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోవడంతో సినిమాపై క్రేజ్ పెరిగింది. జవాన్ విడుదలకు మరో రెండు రోజుల సమయం ఉంది. ఇలా చిత్ర బృందం భారీ ప్రచారం చేస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ 7 నుంచి OTT ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం చేయనున్నట్లు సమాచారం.

బాహుబలి, కేజీఎఫ్‌ రికార్డులు బద్దలే... 
జవాన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డును నెలకొల్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రీ-టికెట్ బుకింగ్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించారు. టిక్కెట్లు కూడా భారీగా అమ్ముడుపోయాయి. అలాగే 'జవాన్' విడుదలకు ముందే ఎన్నో రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త రికార్డును క్రియేట్‌ చేయనుంది. మొదటి రోజు రూ. 70 నుంచి 75 కోట్ల రూపాయల బిజినెస్ చేయనుందని టాక్‌. దీని ద్వారా బాహుబలి 2 (రూ. 58 కోట్లు), కేజీఎఫ్ 2 (రూ. 61 కోట్లు), పఠాన్ (రూ. 55 కోట్లు) రికార్డులను అధిగమిస్తారు.

Advertisement
Advertisement