'జవాన్‌' రెండో ట్రైలర్‌ విడుదల | Shah Rukh Khan's 'Jawan' 2nd Trailer Out Now - Sakshi
Sakshi News home page

Jawan Trailer: జవాన్‌ ట్రైలర్‌ విడుదల.. మా ప్రాణాలు వెయ్యిసార్లయినా పోగొట్టుకుంటాం

Published Thu, Aug 31 2023 1:00 PM

Shah Rukh Khan Jawan 2nd Trailer Out Now - Sakshi

బాలీవుడ్ బాద్​షా షారుక్​ ఖాన్ 'జవాన్' సినిమాపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. యూఎస్​ఏలో ఈ సినిమా ప్రీ బుకింగ్స్​ ఓ రేంజ్‌లో సాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను నెలరోజుల కిందటే విడుదలైంది. అందులో భారీ యాక్షన్‌ సీన్స్‌తో షారుక్‌ అదరగొట్టాడు.  ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గపడుతుండడం వల్ల సినిమాపై మరింత హైప్​ క్రియేట్​ అవుతోంది.

అందువల్ల ఈ సినిమాకు సంబంధించిన రెండో ట్రైలర్‌ను కూడా మేకర్స్‌ తాజాగ విడుదల చేశారు. రెండో ట్రైలర్‌లో కూడా షారుఖ్‌ దుమ్ములేపాడనే చెప్పవచ్చు. ముంబయ్‌లోని మెట్రోను షారుఖ్‌ హైజాక్‌ చేస్తాడు.. ఈ సీన్‌తో ట్రైలర్‌ స్టార్ట్‌ అవుతుంది. ఈ సినిమాలో లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్​గా నటిస్తుండగా కోలీవుడ్‌ స్టార్‌ విజయ్ సేతుపతి విలన్​గా కనిపించనున్నారు. ట్రైలర్‌లో విజయ్‌ సేతుపతిని ‍ప్రత్యేకమైన లుక్‌లో చూపించారని చెప్పవచ్చు. రెడ్ చిల్లీస్ ఎంటర్​టైన్​మెంట్ బ్యానర్​పై గౌరీ ఖాన్ జవాన్​ను భారీ బడ్జెట్​తో రూపొందిస్తున్నరు.

ఈ సినిమా సెప్టెంబర్ 7న పాన్ ఇండియా లెవెల్​లో థియేటర్లలోకి రానుంది .ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా(దుబాయ్)పై జవాన్‌ ట్రైలర్‌ను ప్రదర్శించేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేశారు. దీనిని నేడు రాత్రి (ఆగష్టు 31) 9 గంటలకు పదర్శించనున్నారు. బుర్జ్ ఖలీఫా  బిల్డింగ్​పై షారుక్ సినిమా ట్రైలర్​ను ప్రదర్శించడం ఇది తొలిసారి కాదు. ఈ ఏడాది ఆరంభంలో రిలీజైన 'పఠాన్' సినిమా ట్రైలర్‌ను కూడా ఇదివరకే అక్కడ ప్రదర్శించిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
 
Advertisement