టాలీవుడ్‌లో మరో విషాదం, పాపులర్‌ నటుడు కన్నుమూత

Senior Actor Publicity Incharge Veeramachaneni Pramod Kumar Passes Away - Sakshi

టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్‌ నటుడు, రచయిత, నిర్మాత వీరమాచినేని ప్రమోద్‌ కుమార్‌(87) కన్నుమూశారు. మంగళవారం(మార్చి 21) ఆయన అనారోగ్యంతో తుదిశ్వాస విడిచానట్టు సమాచారం. ఆయన మృతితో టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నటుడిగా, నిర్మాతగా ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇక తన సినిమా అనుభవాలను ‘తెర వెనుక తెలుగు సినిమా’ అనే పేరుతో పుస్తకం రచించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం అందించే నంది పురస్కారానికి ఎంపికైందిది. ఇక పబ్లిసిటీ ఇంఛార్జ్‌గా పాపులర్‌ ఆయిన ఆయన దాదాపు 300 చిత్రాలకు పనిచేశారు. ఈ 300 సినిమాల్లో 31 సినిమాలు శతదినోత్సవ వేడుకులు జరుపుకున్న చిత్రాలు ఉండటం విశేషం.

చదవండి: 
రాజమౌళి నన్ను అవమానించారు: నటి కాంచన సంచలన వ్యాఖ్యలు
ఆర్‌ఆర్‌ఆర్‌కు చిరంజీవి ఇన్వెస్ట్‌ చేశారా? దానయ్య క్లారిటీ

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top