DVV Danayya-RRR: రాజమౌళితో ఆర్‌ఆర్ఆర్‌ సినిమా.. 2006లోనే అడ్వాన్స్‌ ఇచ్చా: నిర్మాత

RRR Producer Danayya Clarifies on Movie Budget and Chiranjeevi - Sakshi

ఇండియన్‌ సనిమాకు కలలగా మిగిలిన ఆస్కార్‌ను ఆర్‌ఆర్‌ఆర్‌ నిజం చేసింది. భారత్‌ గర్వించేవిధంగా ట్రిపుల్‌ ఆర్‌ అకాడమీతో పాటు గ్లోల్డెన్‌ గ్లోబ్‌, హాలీవుడ్‌ క్రిటిక్‌ వంటి ప్రతిష్టాత్మక అవార్డులను గెలిచి విశ్వవేదికలపై సత్తా చాటింది. నాటు నాటు పాట బెస్ట్‌ ఓరిజినల్‌ సాంగ్‌ కాటగిరిలో ఆస్కార్‌క గెలవడంతో ట్రిపుల్‌ ఆర్‌ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోతుంది. ఆస్కార్‌ గెలిచిన సందర్భంగా ఈ మూవీ నిర్మాత డివివి దానయ్య తాజాగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ట్రిపుల్‌ ఆర్‌పై వస్తున్న పలు రూమర్లపై స్పందించారు.

చదవండి: ఆస్కార్‌ కోసం రూ. 80 కోట్లు ఖర్చు పెట్టారా? నిర్మాత దానయ్య ఏమన్నాడంటే..

అంతేకాదు నిర్మాత ఆయనే అయినప్పటికీ ఆర్‌ఆర్‌ఆర్‌ ఇన్వెస్టర్‌ మెగాస్టార్‌ చిరంజీవి అనే ఊహాగానాలపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆర్‌ఆర్‌ఆర్‌ బడ్జెట్‌ ఇంత అంతా అంటూ ఎన్నో వార్తలు వచ్చాయని, నిజానికి రూ. 400 కోట్ల నుంచి రూ. 450 కోట్ల వరకు అయ్యిందన్నారు. అసలు ఆర్ఆర్‌ఆర్‌ మూవీ ఆయనకే రావడంపై ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. ‘రాజమౌళితో సినిమా కోసం 200లోనే ఆయనను సంప్రదించాను. అప్పుడే కొంత మొత్తం అడ్వాన్స్‌ కూడా ఇచ్చాను. అప్పటికే రాజమౌళి రెండు మూడు సినిమాలకు కమిట్‌ అయ్యారు.

అయినా నాతో ఓ సినిమా తప్పకుండ చేస్తానని మాట ఇచ్చారు. చెప్పినట్టే ‘మర్యాద రామన్నా’ కథ ఒకే అడిగారు. నాకు పేరు కావాలి. పెద్ద సినిమా చేయాలనుకుంటున్నా అని చెప్పడంతో సరే అన్నారు’’ అని ఆయన చెప్పారు. ఇక ‘‘బాహుబలి’ తర్వాత ఓ రోజు రాజమౌళి నాకు ఫోన్‌ చేసి ‘మీకు కొన్ని కాల్స్‌ రావచ్చు’ అన్నారు. అదే సమయంలో రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌తో ఆయన ఇంట్లో సమావేశం అయ్యారు. అప్పుడే ముగ్గురి కలిసి ఉన్న ఫొటో బయటకు లీక్‌ చేశారు. దీనిపై మీకు కాల్స్‌ వస్తాయని చెప్పడంతో నాకు అర్థమైంది. రాజమౌళి మెగా హీరో, నందమూరి హీరోతో భారీ చిత్రమే ప్లాన్‌ చేశారని తెలిసి ఆనందపడిపోయా. అలా ఆర్‌ఆర్‌ఆర్‌ నాకు వచ్చింది’ అని చెప్పుకొచ్చారు.

చదవండి: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు హఠాన్మరణం

అనంతరం ఈ మూవీకి చిరు ఇన్వెస్ట్‌ చేశారా? అని అడగ్గా.. ఇదింతా అవాస్తం. అలాంటి గాలి వార్తలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అసలు చిరంజీవి గారికి ఆ అవసరం ఏముంది. ఏ నిర్మాతకైనా డబ్బు ఇన్వెస్ట్‌ చేయడానికి ప్రత్యేకంగా ఫైనాన్షియర్లు ఉంటారు. అంది అందరికి తెలిసిందే. అయినా చిరంజీవి గారు ఆ అవసరం ఏముంది. కావాలంటే తన సొంత సినిమాకు లేదా ఆయన కొడుకే పెట్టుకుంటారు కదా. ఆయనకే నిర్మాణ సంస్థ ఉంది. అలాంటప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఆయన ప్రమేయం ఎందుకు ఉంటుంది. ఎవరో మతిలేక అన్న మాటలు అని కొట్టిపారేశారు. ఇలా మాట్లాడినవాళ్లు నా ఆఫీస్‌కి వచ్చారా? నా బ్యాంక్ స్టేట్మెంట్స్ చూశారా?’ అంటూ ఈ పుకార్లను దానయ్య తీవ్రంగా ఖండించారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top