RRR Movie-Oscar Award: ఆస్కార్‌కు రూ. 80 కోట్లు ఖర్చు పెట్టారా? నిర్మాత దానయ్య ఏమన్నాడంటే..

RRR Producer DVV Danayya Respond Naatu Naatu Won Oscar Award - Sakshi

ఆర్ఆర్ఆర్.. భారత సినీచరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రం ఇది. ఈ సినిమాలో నాటు నాటు పాట ఆస్కార్‌ను గెలవడంతో యావత్‌ భారత్‌ గర్విస్తోంది. అంతేకాదు విశ్వ వేదికలపై గ్లోల్డెన్‌ గ్లోబ్‌, హాలీవుడ్‌ క్రిటిక్‌ వంటి ప్రతిష్టాత్మక అవార్డులను గెలిచిన తొలి భారత చిత్రంగా ఆర్‌ఆర్‌ఆర్‌ సత్తా చాటింది. ఇక ఆస్కార్‌ వేడుకలో భాగంగా దర్శక-దీరుడు రాజమౌళి, ఎమ్‌ఎమ్‌ కీరవాణి, చంద్రబోస్‌, రామ్‌ చరణ్‌, జూ. ఎన్టీఆర్‌తో పాటు ఇతర ఆర్‌ఆర్‌ఆర్‌ టీం మొత్తం అమెరికాలో సందడి చేశారు.

చదవండి: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు హఠాన్మరణం

అయితే చలన చిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ అకాడమీ అవార్డు వేడుకలో అడుగుపెట్టే అవకాశం రావడమంటే అందని ద్రాక్ష వంటిదే. అలాంటి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉన్నా ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాత డివివి దానయ్య పాల్గొనకపోవడం గమనార్హం. నిజానికి అన్నీ తానై చూసుకోవాల్సిన ఆయన ఆస్కార్‌ సెలబ్రెషన్స్‌లో భాగం కాకపోవడంతో అందరిలో ఎన్నో అనుమానాలు రేకిత్తించాయి. దీంతో రకరకాల పుకార్లు తెరపైకి వచ్చాయి. రాజమౌళి పూర్తిగా దానయ్యను పక్కన పెట్టారని, అవార్డు కోసం జక్కన్న దాదాపు రూ. 80 కోట్లు ఖర్చు పెట్టారంటూ రూమర్స్‌ గుప్పుమన్నాయి.

ఈ నేపథ్యంలో తాజాగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ఈ వార్తలపై దానయ్య స్పందించాడు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ట్రిపుల్‌ ఆర్‌ నిర్మాత ఎవరంటే చెప్పే పేరు డివివి దానయ్యే కదా.. తనకు అంది చాలన్నారు. నాటు నాటుకు ఆస్కార్‌ రావడం గర్వంగా ఉందన్నారు. అనంతరం ‘ఆస్కార్‌ అవార్డు వేడుకకు రాజమౌళి నన్ను దూరంగా పెట్టాడు అనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. ఆయన అలాంటి వారు కాదు. తన సినిమా నిర్మాతలకు రాజమౌళి చాలా గౌరవం ఇస్తారు. అలా అవైయిడ్‌ చేసే వ్యక్తిత్వం రాజమౌళిది కాదు. ఆయన చాలా మంచి వ్యక్తి. నాకు ఇష్టంలేకే నేను వెళ్లలేదు. నేను చాలా సింపుల్‌గా ఉంటాను.

చదవండి: మోహన్‌ బాబు బర్త్‌డేలో కొత్త కోడలు మౌనిక సందడి! విష్ణు ఫ్యామిలీ ఎక్కడా?

ఆర్బాటాలు నాకు నచ్చవు. అందుకే ఆస్కార్‌కు దూరంగా ఉన్నా. ఇష్టం లేక ఈ అవార్డు ఫంక్షన్‌కు వెళ్లలేదు. ఈ సినిమాతో నాకు మంచి పేరు రావాలి అనుకున్నా. అది వచ్చింది. నాకది చాలు’ అంటూ వివరణ ఇచ్చారు. అలాగే ఆస్కార్‌ కోసం రూ. 80కోట్లు పెట్టారనడంలో నిజమెంత? అని ప్రశ్నించగా.. తాను అయితే ఎలాంటి డబ్బు పెట్టలేదన్నారు. మరి రాజమౌళి గారు ఏమైనా పెట్టారా? అనేది మాత్రం తనకు తెలియదంటూ ఆసక్తిగా సమాధానం ఇచ్చాడు. అనంతరం అసలు రూ. 80 కోట్లు ఎలా పెడతారంటూ పుకార్లను ఖండిచాడు. సినిమాకే అంత లాభం ఉండదు.. అలాంటిది రూ. 80కోట్లు ఖర్చు పెట్టడం ఎలా సాధ్యమవుతుందంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు దానయ్య. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top