Naresh On Ante Sundaraniki Movie: 200 సినిమాలు చేశా.. నేను చేసిన బెస్ట్‌ తండ్రి పాత్ర ఇదే!  

Senior Actor Naresh Talk In Ante Sundaraniki Movie Press Meet - Sakshi

‘‘నేనిప్పటి వరకు రెండొందలకు పైగా సినిమాలు చేశాను. కానీ, ‘అంటే.. సుందరానికీ’ చిత్రంలో నేను చేసిన బ్రాహ్మణ పాత్రకు తగ్గట్టుగా డబ్బింగ్‌ చెప్పడానికి తొమ్మిది రోజులు పట్టింది. ఇన్ని రోజులు డబ్బింగ్‌ చెప్పుడం ఎప్పుడూ జరగలేదు.. ఇదంతా వివేక్‌ ఆత్రేయ డ్రాఫ్టింగ్‌ వల్లే జరిగింది’’ అని నటుడు వీకే నరేశ్‌ అన్నారు. నాని, నజ్రియా నజీమ్‌ జంటగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంటే.. సుందరానికీ’. నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ నిర్మించిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ చిత్రంలో నాని తండ్రిగా నటించిన వీకే నరేశ్‌ మాట్లాడుతూ.. ‘‘గతంలో జంధ్యాలగారి సినిమాల్లో బ్రాహ్మణుడి పాత్రల్లో నటించాను.

చదవండి: బిగ్‌బాస్‌ విన్నర్‌ సన్నీపై దాడి, పోలీసులకు ఫిర్యాదు

ఇప్పుడు ‘అంటే.. సుందరానికీ’లో చేశాను. ఈ చిత్రంలో నేను చేసిన తండ్రి పాత్ర ది బెస్ట్‌. దానికి కారణాలు వివేక్‌ రూపుదిద్దిన విధానం, నాని, నాకు మధ్య కామెడీ టైమింగ్‌. ఎమోషన్స్‌ను క్యారీ చేస్తూ ఆడియన్స్‌ను నవ్వించే కీలకమైన పాత్ర నాది. రెండు భిన్నమైన మనస్తత్వాలు గల కుటుంబాల మధ్య ఏం జరిగింది? అనేది ఈ సినిమాలో ఆసక్తిగా ఉంటుంది. మొత్తంగా చెప్పాలంటే ఈ సినిమా పదహారు కూరల తెలుగు కంచం. నా కెరీర్‌ను తర్వాతి స్థాయికి తీసుకెళ్లే మూవీ అవుతుంది. మైత్రీ మూవీస్‌ మంచి కుటుంబ కథా చిత్రాలకు ఆణిముత్యం లాంటి సంస్థ.  ప్రస్తుతం నేను లీడ్‌ రోల్‌లో రెండు సినిమాలు చేస్తున్నాను’’ అన్నారు.

చదవండి: తమ రిలేషన్‌ను అధికారికంగా ప్రకటించిన లవ్‌బర్డ్స్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top