సినిమా కథ తెలుసుకున్నా: బాలకృష్ణ | Sehari Movie First Look Launch By Nandamuri Balakrishna | Sakshi
Sakshi News home page

ఓ ప్రేమ కథ

Nov 17 2020 6:27 AM | Updated on Nov 17 2020 6:56 AM

Sehari Movie First Look Launch By Nandamuri Balakrishna - Sakshi

‘సెహరి’ చిత్రనిర్మాత అద్వయ జిష్ణురెడ్డి నా స్నేహితుడు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి మేనళ్లుడు. ఈ సినిమా కథ తెలుసుకున్నా.. బాగుంది’’ అన్నారు నటుడు బాలకృష్ణ. హర్ష కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి జంటగా సంగీత దర్శకుడు కోటి కీలక పాత్ర చేసిన చిత్రం ‘సెహరి’. జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వంలో అద్వయ జిష్ణు రెడ్డి, శిల్పా చౌదరి నిర్మిస్తున్నారు. సోమవారం  హర్ష కనుమిల్లి కనుమిల్లి పుట్టినరోజు సందర్భంగా  ‘సెహరి’ ఫస్ట్‌ లుక్‌ని బాలకృష్ణ ఆవిష్కరించారు. ‘‘ఈ చిత్రం షూటింగ్‌ను ఇటీవలే ప్రారంభించి మొదటి షెడ్యూల్‌ పూర్తి చేశాం. ఫస్ట్‌ షెడ్యూల్‌ చాలా బాగా వచ్చింది’’ అన్నారు అద్వయ జిష్ణు రెడ్డి, శిల్పా చౌదరి. ‘‘న్యూ ఏజ్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న చిత్రమిది’’ అన్నారు జ్ఞానసాగర్‌ ద్వారక.

Advertisement
 
Advertisement
Advertisement