‘సీతారామ‌పురంలో  ఒక ప్రేమ జంట’ బాగా ఆడాలి: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

Seetharamapuram Lo Oka Prema Janta Teaser Launched By Minister Srinivas Goud - Sakshi

ఎమ్.విన‌య్ బాబు ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న తాజా చిత్రం ‘సీతారామపురంలో ఒక ప్రేమ జంట’. శ్రీ ధ‌న‌ల‌క్ష్మి మూవీస్ ప‌తాకంపై  బీఉ చందర్‌ గౌడ్‌ నిర్మిస్తున్న ఈ ప్రేమ కథా చిత్రంతో రణధీర్‌, నందిని రెడ్డి హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ని తెలంగాణ మంత్రి శీనివాస్‌ గౌడ్‌ విడుదల చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పాట‌లు, టీజ‌ర్ చూశాక ఇదొక చ‌క్క‌టి ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ చిత్ర‌మని అర్థ‌మ‌వుతోంది. అంద‌రూ కొత్త‌వారు న‌టించిన ఈ చిత్రం విజ‌య‌వంతం కావాల‌ని కోరుకుంటున్నాను. సింగిల్ విండో విధానం ద్వారా తెలంగాణలో ఎక్క‌డైనా షూటింగ్ చేసుకోవ‌డానికి  త‌క్కువ రేట్ల‌తో ప‌ర్మిష‌న్స్ ఇస్తున్నాం. తెలంగాణ‌లో ఎన్నో అద్భుత‌మైన లొకేష‌న్స్ ఉన్నాయి. ఇక్క‌డ మంచి క‌ల్చ‌ర్ ఉంది. తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల చిత్రాలు కూడా ఇక్క‌డ షూటింగ్స్ జ‌రుపుకుంటున్నాయి. తెలంగాణ ప్ర‌భుత్వం సినిమా ప‌రిశ్ర‌మ‌కి అన్నివిధాలస‌హ‌క‌రిస్తోంది. ప్ర‌స్తుతం తెలంగాణ భాష‌, యాస‌లో వ‌చ్చే చిత్రాలు బాగా స‌క్సెస్ అవుతున్నాయి.  ఈ కోవ‌లో  సీతారామ‌పురంలో  ఒక ప్రేమ జంట చిత్రం కూడా బాగా ఆడాల‌ని కోరుకుంటూ చిత్ర యూనిట్ కి నా శుభాకాంక్ష‌లు`` అన్నారు.

దర్శకుడు వినయ్‌ బాబు మాట్లాడుతూ.. డిఫ‌రెంట్  వేలో ఆలోచించి  తీసిన ల‌వ్ స్టోరి ఇది.  ప్రేమించ‌డం కాదు...ఆ ప్రేమ‌ను నిల‌బెట్టుకోవాల‌న్న అంశాన్ని మా చిత్రం ద్వారా చూపిస్తున్నాం. ఎక్క‌డా వ‌ల్గారిటీకి తావుండ‌దు. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే విధంగా సినిమా ఉంటుంది’అన్నారు.

నిర్మాత బీసు చంద‌ర్ గౌడ్ మాట్లాడుతూ…‘ద‌ర్శ‌కుడు విన‌య్ బాబు చెప్పిన క‌థ న‌చ్చి మా అబ్బాయి ర‌ణ‌ధీర్ ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ ఈ సినిమా నిర్మించాను. ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా క‌థకు త‌గ్గ‌ట్టుగా ఖ‌ర్చు పెట్టాం.  గ్రామీణ వాతావ‌ర‌ణంలో జ‌రిగే చ‌క్క‌టి ప్రేమ‌క‌థా చిత్ర‌మిది. క‌థ‌లో మంచి మ‌లుపులు ఉన్నాయి.  క‌థా ప‌రంగా చాలా పెద్ద సినిమా ఇది. విడుద‌లైన పాట‌ల‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. సినిమా అవుట్ పుట్ బాగొచ్చింది. ద‌ర్శ‌కుడు చెప్పిన‌దానిక‌న్నా సినిమాను చాలా బాగా తెర‌కెక్కించాడు. త్వ‌ర‌లో విడుద‌ల తేదీ ప్ర‌క‌టిస్తాం’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top