Satyadev: క్రైమ్‌ జీబ్రా

Satyadev And Daali Dhananjaya Film Titled Zebra - Sakshi

సత్యదేవ్, డాలీ ధనుంజయ హీరోలుగా నటిస్తున్న యాక్షన్‌ క్రైమ్‌ ఎంటర్‌టైనర్‌కు ‘జీబ్రా’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ‘లక్‌ ఫేవర్స్‌ ది బ్రేవ్‌’ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్‌ పిచినెటో కథానాయికలుగా నటిస్తున్నారు. ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వంలో ఎస్‌ఎన్‌ రెడ్డి, బాలసుందరం, దినేష్‌ సుందరం నిర్మిస్తున్న చిత్రం ఇది. గురువారం ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించారు.

‘‘తొలి షెడ్యూల్‌ను 50 రోజులపాటు జరిపాం. బ్యాలెన్స్‌ షూటింగ్‌ను హైదరాబాద్, కోల్‌కతా, ముంబై లొకేషన్స్‌లో ప్లాన్‌ చేశాం. ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ రవిబస్రూర్‌ సంగీతం ఈ సినిమాను మరో స్థాయికి తీసుకుని వెళుతుంది’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా–సహనిర్మాత: సుమన్‌ ప్రసార బాగే.

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top