‘కంగనా వ్యాఖ్యలపై అక్షయ్‌ స్పందించాలి’

Sanjay Raut Says Akshay Should Speak On Kangana Row - Sakshi

ముంబై : బీజేపీ, బాలీవుడ్‌ పరిశ్రమపై శివసేన నేత సంజయ్‌ రౌత్ విమర్శనాస్థ్రాలు సంధించారు. ముంబైని పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)తో పోల్చిన వారిని బీజేపీ సమర్ధిస్తోందని విమర్శించారు. ఆ నటి (కంగనా రనౌత్‌) ముంబైని పీఓకేతో పోల్చితే ఏ ఒక్కరూ మాట్లాడలేదని రౌత్‌ మండిపడ్డారు. కాగా ముంబైను విమర్శించిన కంగనా వ్యాఖ్యలపై బాలీవుడ్‌ స్టార్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ స్పందించకపోవడం బాధాకరమని తెలిపారు.

ముంబై నగరం బాలీవుడ్‌ నటులకు డబ్బుతో సహా కావాల్సినవన్ని సమకూర్చుంది. కానీ నగరం కేవలం వారికి డబ్బులు సంపాదించేందుకేనా అని బాలీవుడ్ పరిశ్రమను ఉద్దేశించి ప్రశ్నించారు. అయితే బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో రాజ్‌పుత్‌, క్షత్రియ ఓట్లను ఆకట్టుకోవడం కోసమే బీజేపీ ప్రయత్నమని సంజయ్‌ రౌత్‌ ఆరోపించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top