సైన్స్‌ ఫిక్షన్‌ కావడంతో థ్రిల్‌ ఫీల్ అవుతారు: హీరో | Sakshi
Sakshi News home page

Sandeep Madhav: సైన్స్‌ ఫిక్షన్‌ కావడంతో థ్రిల్‌ ఫీల్ అవుతారు: హీరో

Published Sat, Jul 2 2022 12:20 PM

Sandeep Madhav About Gandharva Movie In Press Meet - Sakshi

Sandeep Madhav About Gandharva Movie In Press Meet: సందీప్‌ మాధవ్, గాయత్రీ ఆర్‌. సురేష్‌ జంటగా అప్సర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గంధర్వ’. ఫన్నీ ఫాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సుభాని నిర్మించిన ఈ సినిమా ఎస్‌కే ఫిలింస్‌ సహకారంతో యాక్షన్‌ గ్రూప్‌ సమర్పిస్తోంది. ఈ నెల 8న విడుదల కానున్న ఈ సినిమా  ప్రివ్యూను కొంతమంది ప్రేక్షకులకు చూపించారు. 

ఈ సందర్భంగా దర్శకుడు అప్సర్‌ మాట్లాడుతూ.. ‘‘గంధర్వ’ యూనిక్‌ పాయింట్‌. సందీప్‌ ఈ కథ విని ఎగ్జయిట్‌ అయ్యాడు. క్లైమాక్స్‌ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఫస్ట్‌ కాపీ చూసిన తర్వాత సురేష్‌ కొండేటి ఈ సినిమాను విడుదల చేస్తానని చెప్పడం మా మొదటి విజయంగా భావిస్తున్నాం’’ అని తెలిపారు. ‘‘సైన్స్‌ ఫిక్షన్‌ కావడంతో ఈ కథను ఆడియన్స్‌ కొత్తగా ఫీలవుతారు.. థ్రిల్‌ అవుతారు. కామెడీ, యాక్షన్‌ కూడా ఉన్నాయి’’ అని సందీప్‌ పేర్కొన్నాడు. ‘‘ఇండియన్‌ సినిమాలో ఇంతవరకు రాని పాయింట్‌ ఇది. ‘వంగవీటి’, ‘జార్జిరెడ్డి’ చిత్రాల తర్వాత సందీప్‌కు ఈ చిత్రం హాట్రిక్‌ అవుతుంది’’ అన్నారు ఎస్‌కే ఫిలింస్‌ అధినేత సురేష్‌ కొండేటి.    

చదవండి:👇
ఫ్రెండ్‌తో బెడ్‌ షేర్‌.. అబార్షన్‌.. ఎలాంటి పశ్చాత్తాపం లేదు: నటి
నగ్నంగా విజయ్‌ దేవరకొండ.. ఫొటో వైరల్‌
తొలిసారిగా మోహన్‌ బాబు, మంచు లక్ష్మీల కాంబినేషన్‌..
నా రిలేషన్‌ గురించి దాచాలనుకోవట్లేదు: శ్రుతి హాసన్‌

Advertisement
Advertisement