కెరీర్ పీక్‌లో సంయుక్త… పెళ్లి వార్తలతో హడావిడి | Samyukta Menon Wedding Rumours once again in film industry | Sakshi
Sakshi News home page

కెరీర్ పీక్‌లో సంయుక్త… పెళ్లి వార్తలతో హడావిడి

Apr 21 2026 10:59 PM | Updated on Apr 21 2026 11:13 PM

Samyukta Menon Wedding Rumours once again in film industry

సినీ ఇండస్ట్రీలో మరోసారి సంయుక్త మీనన్ పెళ్లి వార్తలు చర్చనీయాంశమయ్యాయి. గతంలోనూ ఆమె పెళ్లి గురించి రూమర్లు గట్టిగా వినిపించాయి. అయితే ఆ సమయంలో సంయుక్త స్వయంగా స్పందించింది. తన పెళ్లి వార్తలను పక్కన పెట్టాలని, నటిగా తన పనిని మాత్రమే గమనించాలని కోరింది.  

అయితే తాజాగా మళ్లీ సంయుక్తపై పెళ్లి పుకార్లు గుప్పుమంటున్నాయి. 30 ఏళ్ల ఈ మలయాళీ నటి ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుసపెట్టి సినిమాలు చేస్తూ కెరీర్ పీక్‌ స్టేజ్‌లో ఉంది. ఇక ఈ సమయంలోనే తను పెళ్లి చేసుకునే అవకాశం ఉందంటూ ప్రచారం మొదలైంది. కానీ కొంతమంది మాత్రం రష్మిక మందన్న తరహాలో సంయుక్త కూడా పెళ్లి చేసుకొని తన కెరీర్ కొనసాగిస్తుందని అంటున్నారు. త్వరలోనే ఆమె నిఖిల్‌తో కలిసి నటించిన ‘స్వయంభు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతోపాటు ‘బ్లాక్ గోల్డ్’ అనే మరో ప్రాజెక్ట్‌లోనూ నటిస్తోంది. కాగా తాజా పెళ్లి పుకార్లపై సంయుక్త మీనన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement