చై అమాయకుడు, ఎందుకు మోసం చేశావ్‌? సామ్‌ ఆన్సరిదే! | Samantha Strong Counter To Troller Who Said She Cheated Naga Chaitanya | Sakshi
Sakshi News home page

Samantha: అమాయకుడైన చైని మోసం చేశావ్‌.. ఇచ్చిపడేసిన సామ్‌

Apr 10 2024 9:04 AM | Updated on Apr 10 2024 9:39 AM

Samantha Strong Counter To Troller Who Said she Cheated Naga Chaitanya - Sakshi

అమాయకుడైన నీ భర్తను ఎందుకు మోసం చేశావో చెప్పు అని కామెంట్‌ చేశాడు. ఇది చూసిన సామ్‌.. సారీ, ఇలాంటివి చేయడం మీకంత మంచిది కాకపోవచ్చు. మీకింకా

ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట ఎందుకు విడిపోతుంది? పెళ్లికి ముందు ఉన్న ప్రేమ తర్వాత ఎందుకు ఉండట్లేదు? జీవితాంతం కలిసుండాలనుకున్న లవ్‌ బర్డ్స్‌ భార్యాభర్తలుగా ఎందుకు కంటిన్యూ అవలేకపోతున్నారు? ఈ ప్రశ్నలకు కారణాలెన్నో...! కొన్నిసార్లు తప్పు ఒకరివైపు ఉండొచ్చు, మరికొన్నిసార్లు ఇరువైపులా ఉండొచ్చు. మూడో వ్యక్తి మధ్యలో దూరడం వల్ల కూడా అవొచ్చు లేదా ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్‌ లేకపోవడమూ ఓ కారణం కావొచ్చు.

మోసం చేశావని కామెంట్స్‌
సెలబ్రిటీలైతే అవన్నీ బయటకు చెప్పుకోలేక భేదాభిప్రాయాల వల్ల విడిపోతున్నామని సింపుల్‌గా చెప్పేస్తారు. కానీ దాని వెనక ఉన్న బాధను లోలోపలే భరిస్తూ పైకి నవ్వుతూ కనిపిస్తారు. ఇది అర్థం చేసుకోలేని జనాలు.. ఎంతసేపూ నువ్వు మా వాడిని మోసం చేశావు.. నువ్వు మా హీరోయిన్‌ను మోసం చేశావంటూ వారిని నిందిస్తూనే ఉంటారు.

హద్దులు దాటిన నెటిజన్‌
అలా సమంత- నాగ చైతన్య విడాకులు తీసుకుని దాదాపు మూడేళ్లు కావస్తున్నా ఇప్పటికీ వారిని విమర్శించడం ఆపడం లేదు. ఇటీవల ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సామ్‌ ఆరోగ్యం గురించి తెలుపుతూ ఓ పాడ్‌కాస్ట్‌ వీడియో షేర్‌ చేసింది. ఓ నెటిజన్‌ ఈ వీడియో గురించి మాట్లాడకుండా ఆమె వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ హద్దులు దాటాడు.

సామ్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌
అమాయకుడైన నీ భర్తను ఎందుకు మోసం చేశావో చెప్పు అని కామెంట్‌ చేశాడు. ఇది చూసిన సామ్‌.. సారీ, ఇలాంటివి చేయడం మీకంత మంచిది కాకపోవచ్చు. మీకింకా స్ట్రాంగ్‌ టెక్నిక్స్‌ కావాలి. మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా అని చేతులెత్తి నమస్కరిస్తున్న ఎమోజీతో రిప్లై ఇచ్చింది. ఇది చూసిన ఫ్యాన్స్‌ నిన్ను కిందకు దిగజార్చాలనుకునే ట్రోలర్స్‌కు ఇలాగే ఇచ్చిపడేయ్‌.. ఎవరికీ అవకాశం ఇవ్వకు అని కామెంట్స్‌ చేస్తున్నారు.

చదవండి: అఫీషియల్ ప్రకటన.. ఆ రోజు నుంచే భీమా స్ట్రీమింగ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement