
భారీ అంచనాలతో విడుదలైన గోపీచంద్ 'భీమా' సినిమా విడుదలైన తొలిరోజే బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని ఎ.హర్హ డైరెక్షన్‌లో తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీలో గోపీచంద్ పోలీసు పాత్రలో మరోసారి తన అభిమానులను మెప్పించారు. టెంపుల్ బ్యాక్‌డ్రాప్‌లో కథ ప్రారంభం కావాడంతో సినిమా సూపర్ హిట్ అనుకున్నారు. కానీ తర్వాత ఔట్‌డేటెడ్ స్టోరీతో కథను నడిపించడం వల్ల సినిమాకు పెద్ద మైనస్ అయిందని ఆడియన్స్ చెప్పుకొచ్చారు.
అయితే ఇటీవల ఈ చిత్రం ఓటీటీలోకి వస్తుందని అభిమానులు అంతా భావించారు. గతవారమే ఏప్రిల్ 5 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని భావించినప్పటికీ అలా జరగలేదు. దీంతో భీమా ఓటీటీ కొత్త తేదీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజాగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించింది. ఉగాది సందర్భంగా అఫీషియల్ డేట్‌ను రివీల్ చేసింది. ఈనెల 25 నుంచి భీమా స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి రానుంది.
Surprise surprise!
Bringing the action-packed, thrilling entertainer, #Bhimaa to your screens on April 25th!#BhimaaonHotstar@YoursGopichand @priya_Bshankar @ImMalvikaSharma @NimmaAHarsha@KKRadhamohan @RaviBasrur@SriSathyaSaiArt pic.twitter.com/9wIjhzLigr— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) April 9, 2024