త్వరలో సెట్‌లోకి... | Samantha Ruth Prabhu upcoming projects | Sakshi
Sakshi News home page

త్వరలో సెట్‌లోకి...

Jul 20 2024 2:23 AM | Updated on Jul 20 2024 2:23 AM

Samantha Ruth Prabhu upcoming projects

సినిమా సెట్‌లో అడుగుపెట్టి మునుపటి ఉత్సాహంతో చిత్రీకరణలో పాల్గొనడానికి సమంత రెడీ అవుతున్నట్లు సమాచారం. అనారోగ్య సమస్యల కారణంగా కొంత కాలంగా ఆమె చిత్రీకరణలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. కాగా వచ్చే నెల నుంచి సమంత మూవీ సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారని టాక్‌. అంతేకాదు... తన భవిష్యత్‌ సినిమాల్లోని రోల్స్‌కు సంబంధించి ప్రత్యేక శిక్షణతో ప్రస్తుతం ఆమె బిజీగా ఉన్నారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం.

కాగా ఈ ఏడాది ఏప్రిల్‌ 28న తన బర్త్‌ డే సందర్భంగా ‘మా ఇంటి బంగారం’ సినిమాను ప్రకటించారు సమంత. ఈ సినిమాలోని మెయిన్‌ లీడ్‌ రోల్‌లో నటించి, నిర్మించనున్నారు. అలాగే తమిళ హీరో విజయ్‌తో ఓ సినిమా, ఓ హిందీ సినిమాలో కూడా సమంత హీరోయిన్‌గా నటించనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి... సమంత ఏ సినిమా సెట్స్‌లో ముందుగా అడుగుపెడతారు? ప్రస్తుతం ఏ సినిమాలోని పాత్ర కోసం శిక్షణ తీసుకుంటున్నారనేది తెలియాల్సి ఉంది. ఇక  సమంత నటించిన ‘సిటాడెల్‌’ వెబ్‌ సిరీస్‌ త్వరలో స్ట్రీమింగ్‌ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement