నిర్మాతగా సమంత.. కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది | Samantha As Producer New Film Announced | Sakshi
Sakshi News home page

నిర్మాతగా సమంత.. కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది

Apr 28 2024 3:25 PM | Updated on Apr 28 2024 3:31 PM

Samantha As Producer New Film Announced

హీరోయిన్‌గా ఎన్నో విభిన్నమైన చిత్రాల్లో నటించిన సమంత వ్యాఖ్యాతగా, వ్యాపారవేత్తగా కూడా రాణించింది. తాజాగా టాలీవుడ్‌లో ఆమె మరో అడుగు ముందుకు వేసింది.  నిర్మాతగా మారిన సమంత తన కొత్త సినిమాను ప్రకటించింది. ఈ మేరకు తన  కొత్త ప్రొడక్షన్  'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్​' కంపెనీ నుంచి మొదటి సినిమా ప్రకటన అఫీషియల్‌గా వచ్చేసింది.

నేడు (ఏప్రిల్‌ 28న) సమంత పుట్టిన రోజు సందర్భంగా తన నిర్మాణ సంస్థ నుంచి కొత్త ప్రాజెక్ట్‌ ప్రారంభించింది. 'మా ఇంటి బంగారం' అనే టైటిల్‌తో పోస్టర్‌ విడుదల చేశారు. తన సొంత నిర్మాణ సంస్థలో సమంత లీడ్‌ రోల్‌లో నటిస్తుంది. తాజాగా విడుదలైన పోస్టర్‌లో సమంత చీరకట్టుకుని చేతిలో తుపాకీ పట్టి సీరియస్‌ లుక్‌తో కనిపిస్తుంది. లేడీ ఓరియేంటెడ్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సినిమాలు నిర్మించే విషయంలో హైదరాబాద్‌కు చెందిన ఎంటర్​టైన్​మెంట్ కంపెనీ 'మండోవా మీడియా వర్క్స్'తో సమంత ఒప్పందం కుదుర్చుకుంది. సినిమా ఇండస్ట్రీలో ఈ సంస్థకు మంచి గుర్తింపే ఉంది. తమ భాగస్వామ్యంలో వెబ్ సిరీస్‌తో పాటు సినిమాలు, టీవీ ప్రోగ్రామ్స్‌ రూపొందించే అవకాశం ఉందని మండొవా మీడియా వర్క్స్​ అధినేత హిమాంక్​ దువుర్రు గతంలో తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement