సమంత శారీ, జ్యువెలరీ ఖరీదు ఎంతో తెలుసా

Samantha Cute Look In Bigg Boss Designer Manogna - Sakshi

టాలీవుడ్‌ టాప్‌ రేటింగ్‌ షో బిగ్‌బాస్‌కు ఉన్న క్రేజ్‌ అంతాఇంతా కాదు. పడుచు పిల్లోడు నుంచి పండు ముసలి వరకు వయసుతో సంబంధం లేకుండా షోను వీక్షించేవారే. నాల్గో సీజన్‌ బిగ్‌బాస్‌కు వ్యాఖ్యాతగా వ్యహరిస్తున్న కింగ్‌ నాగార్జున షోకు ప్రత్యేక ఆకర్షణ అనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పక తప్పదు. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తక్కువ కాకుండా షో నిర్వహణలో ఆయన కూడా ఎప్పూడూ కొత్తదనాన్ని పరిచయం చేస్తూ ఉంటారు. అయితే దసర పండుగ సందర్భంగా బిగ్‌బాస్‌ అభిమానులకు, వీక్షకులకు కింగ్‌ పెద్ద సర్‌ప్రైజే ఇచ్చాడు. ఎవరూ ఊహించని విధంగా కోడలు అక్కినేని సమంతను షో వ్యాఖ్యతగా బాధ్యతలు అప్పగించాడు.

కఠినమైన పాత్రలను సైతం సవాలుగా స్వీకరించే సమంత.. మామ నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా తన మాటల మంత్రంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. చేసిన ఒక్క ఎపిసోడ్‌లోనే ప్రేక్షకులను తనవైపు తిప్పుకొని.. మామకు తగ్గ కోడలు అనిపించుకుని విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తొలిసారి హోస్టింగ్‌గా వ్యవహరిస్తుండటంతో లుక్‌పైనా అక్కినేని కోడలు ప్రత్యేక దృష్టి పెట్టింది. తెలుగుదనం  ఉట్టిపడేలా సాంప్రదాయబద్దంగా చీరకట్టులో మైమరిపించింది. సామ్‌ లుక్‌పై సోషల్‌ మీడియాలో సైతం పెద్ద చర్చే సాగింది. అయితే ఆమె డిజైనర్‌ మనోజ‍్క్ష పడిన కష్టం అంతా ఇంతా కాదు. (నాగ్‌ వెనుక స్టైలిష్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌)

వింటేజ్‌ లుక్‌లో సమంతను సరికొత్తగా చూపించింది ఫ్యాషన్‌ డిజైనర్‌ మనోజ్ఞ. రూ.44,800 విలువైన బనారస్‌ చీరను కట్టించి, ఆమె ఒంటిపై ఒరిజినల్‌ నగలను వేశారు. నెక్‌ చోకెర్, ఇయర్‌ రింగ్స్, త్రిశూల్, బ్యాంగిల్స్‌ వంటి వాటిని ధరించింది. వీటన్నిటి ఖరీదు సుమారు రూ.35 లక్షల పైమాటే. ఎంతో అందంగా సమంతను తయారు చేయడం వల్ల.. ఆ ఎపిసోడ్‌పై హైప్‌ బాగా వచ్చింది. సమంత చీర ఖరీదు రూ.44లక్షలు అంటూ కూడా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే.. చీర ఖరీదు కేవలం రూ.44,800 అని, జ్యువెలరీ మాత్రం రూ.35 లక్షలంటూ మనోజ్ఞ పేర్కొంది. అంతేకాదు బిగ్‌బాస్‌ షోకు నాగార్జునకు సైతం ఆమే డిజైనర్‌గా వ్యవహరిస్తోంది. ఓ పక్క మామని, మరో పక్క కోడల్ని హ్యాండిల్‌ చేస్తూ.. అందరి మన్ననలు సొంతం చేసుకుంది మనోజ్ఞ ఆవునూరి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top