
Naga Chaitanya-Samantha Divorce: సమంత-నాగ చైతన్య విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
Naga Chaitanya-Samantha Divorce: అందరూ అనుకున్నదే నిజమైంది. టాలీవుడ్ స్టార్ కపుల్స్ సమంత-నాగ చైతన్య విడిపోయారు. ఈ విషయాన్ని నాగ చైతన్య ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని, ఎవరి దారి వారు చూసుకోవాలనుకున్నామని పేర్కొన్నారు.తమ ప్రైవసీకి భంగం కలిగించొద్దంటూ కోరాడు.
మరోవైపు సమంత సైతం నాగచైతన్యతో విడిపోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించింది. పదేళ్ల స్నేహానికి ముగింపు పలుకుతున్నామని, అయితే విడిపోయినా స్నేహితులుగా కలిసి ఉంటామని పేర్కొంది. కాగా 2017, అక్టోబర్ 7న సమంత- నాగ చైతన్య పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. గోవాలో క్రిస్టియన్, హిందూ సాంప్రదాయాల ప్రకారం వీరు పెళ్లి చేసుకున్నారు.
— chaitanya akkineni (@chay_akkineni) October 2, 2021