Bigg Boss 16 Season: రూ. 1000 కోట్ల పారితోషికంపై క్లారిటీ ఇచ్చిన సల్మాన్‌ ఖాన్‌

Salman Khan Response On Rs 1000Cr Remuneration For Bigg Boss 16 - Sakshi

ప్రముఖ బిగ్గెస్ట్‌ రియాలిటీ షో బిగ్‌బాస్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షోకు దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. సినీ, టీవీ సెలబ్రెటీలను మూడు నెలల పాటు ఒకే గూటిలో లాక్‌ చేసి ప్రేక్షకులకు వినోదం అందిస్తోంది. తెలుగులో ప్రస్తుతం 6వ సీజన్‌ను జరుపుకుంటున్న ఈ షో, హిందీలో 15 సీజన్లు జరుపుకుంది. ఇప్పుడు 16వ సీజన్‌కు రెడీ అవుతోంది. అయితే ఈ షోకు హోస్ట్‌ వ్యవహరిస్తున్న బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌కు ఈ సీజన్‌కు గానూ రూ. 1000 కోట్లు పారితోషికం ఇస్తున్నట్లు కొద్ది రోజులుగా పుకార్లు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై సల్మాన్‌ క్లారిటీ ఇచ్చాడు.  

చదవండి: ఒంటిపై చేయి వేశాడని అభిమాని చెంపచెళ్లుమనిపించిన హీరోయిన్‌

ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న సల్మాన్‌కు రూ. 1000 కోట్ల రెమ్యురేషన్‌పై ప్రశ్న ఎదురైంది. ఇక దీనికి అతడు స్పందిస్తూ.. ‘ఈ వార్తల్లో నిజం లేదు. నేనే అంత రెమ్యునరేషన్‌ తీసుకుంటే ఇక జీవితంలో నేను పని చేయాల్సిన అవ‌స‌రం ఉండదు. అయితే ఇది ఎప్పటికైన నిజం కావాలని కోరుకుంటున్నా. అయినా నేను వెయ్యి కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకుంటే అది నా లాయర్ల ఫీజులు వంటి ఇతర అవ‌స‌రాల‌కే సరిపోతుందేమో. ఎందుకంటే నా లాయర్లు నాకంటే తక్కువేం కాదు(నవ్వుతూ). నా సంపాదన ఇందులో పావు వంతు కూడా ఉండ‌దు. ఈ వార్త‌ల‌ను ఆదాయపు పన్ను శాఖ‌, ఈడీ వాళ్లు కూడా చదువుతున్నారు’ అంటూ ఫన్నీ కామెంట్స్‌ చేశాడు.

చదవండి: నానమ్మను తలుచుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చిన సితార

ఆ తర్వాత బిగ్‌బాస్‌ షోను హోస్ట్‌ చేయాలని లేదని, కానీ తప్పడం లేదంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. ‘ఈ షోలో నాకు చిరాకు వచ్చే సందర్భాలు చాలా ఉన్నాయి. నేను షోను హోస్ట్ చేయనని బిగ్‌బాస్‌ నిర్వహకులు చెప్పాను. కానీ వాళ్ల‌కు మ‌రో చాయిస్ లేదు కాబ‌ట్టి నా వద్దకు తిరిగి వచ్చారు. వాళ్ల‌కు చాయిస్ ఉండి ఉంటే న‌న్ను వారు ఎప్పుడో తీసేసి ఉండేవారు. నా స్థానాన్ని భ‌ర్తీ చేసేవాళ్లు ఉన్న‌ప్ప‌టికీ, చానల్ వాళ్లు ఎప్ప‌టికీ ఆ ప‌ని చేయ‌రు’ అని నవ్వుతూ అన్నాడు. ఇక‌ ఈ షోలో తాను త‌ర‌చూ సహనం కోల్పోవ‌డంపై స్పందిస్తూ.. . పోటీదారులు అతి చేయ‌డం వ‌ల్ల తాను కొన్నిసార్లు పరిమితిని దాటవలసి వ‌స్తుంద‌న్నాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top