Is Allu Aravind Planning To Buy Salaar Telugu Rights? - Sakshi
Sakshi News home page

Salaar: అల్లు అరవింద్ బిగ్ ప్లాన్.. ఇది జరుగుతుందా?

Jul 6 2023 2:21 PM | Updated on Jul 6 2023 2:34 PM

Salaar Telugu Rights Allu Aravind Planning - Sakshi

పాన్ ఇండియా స్టార్ హీరో​ ప్రభాస్‌తో సాలిడ్ యాక్షన్ మూవీ 'సలార్​'ను హోంబలే ఫిలింస్‌ వారు నిర్మిస్తున్నారు. నేడు (జులై 6)  టీజర్‌ను కూడా వదిలారు మేకర్స్‌.. 'కేజీయఫ్'​ బ్లాక్​ బస్టర్​ తర్వాత స్టార్​ డైరెక్టర్​ ప్రశాంత్‌ నీల్‌ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. కాబట్టి  ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు పెరిగాయి. సెప్టెంబరు 28న మొదటి భాగం రానున్నట్లు మేకర్స్‌ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. దీంతో ఇండియన్‌ సినిమా చరిత్రలో అన్ని భాషలలో భారీ బిజినెస్‌ జరగనుంది.

(ఇదీ చదవండి: నిహారిక,బిందు మాధవి ఎందరో అంటూ.. మంచు లక్ష్మీ వైరల్‌ కామెంట్స్‌)

ఇప్పటికే ఈ సినిమా రైట్స్‌ కొనుగోలు చేసేందకు భారీగానే పోటీ పడుతున్నారు. సలార్‌ తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను అల్లు అరవింద్‌ తీసుకోబోతున్నారని ప్రచారం జరుగుతుంది. గీతా ఆర్ట్స్ 50వ వార్షికోత్సవాన్ని త్వరలో జరుపుకోనుంది. అందుకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలని ఈ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ ద్వారా విడుదల చేయాలని అల్లు అరవింద్ ప్లాన్‌ చేస్తున్నారట.

అయితే, సలార్‌ను నిర్మిస్తున్న హోంబలే ఫిల్మ్స్ వారి నుంచి రైట్స్‌ కొనుగోలు చేయడం అంత సులభమైన విషయం కాదు. సలార్‌కు పెరుగుతున్న బజ్‌ కారణంగా సినిమా రైట్స్‌కు భారీగానే ధరను ఫిక్స్‌ చేస్తారు. లేదా కొన్ని షరతులతో మూవీ రైట్స్‌ను విక్రయిస్తారు. గతంలో కూడా  KGF 2 తెలుగు హక్కులను వారు విక్రయించలేదు. కమీషన్ ఆధారంగా తెలుగులో విడుదల చేశారు. దాంతో భారీగానే లాభాలను పొందారు. 

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లోకి 24 సినిమాలు)

అలాంటిది కేజీఎఫ్-2 రైట్స్‌నే అమ్మకపోతే సలార్ తెలుగు రైట్స్ అమ్ముతారా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. అల్లు అరవింద్ వారిని ఒప్పించగలుగుతారా? అనేదానికి సమాధానం త్వరలో తెలుస్తుంది. అయితే, 'కాంతార' సినిమాను నిర్మించింది కూడా హోంబలే ఫిల్మ్స్ వారే... ఇదే మూవీని  తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌నే. కాబట్టి వారితో అల్లు అరవింద్‌కు మంచిపరిచాయాలే ఉ‍న్నాయి కాబట్టి సలార్‌ అవకాశం కూడా రావచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement