Manchu Lakshmi About Niharika Konidela And Bindu Madhavi Movie Chances - Sakshi
Sakshi News home page

నిహారిక,బిందు మాధవి ఎందరో అంటూ.. మంచు లక్ష్మీ వైరల్‌ కామెంట్స్‌

Jul 6 2023 11:55 AM | Updated on Jul 6 2023 12:15 PM

Manchu Lakshmi About Konidela Niharika And Bindu Madhavi Movie Chance - Sakshi

టాలీవుడ్‌లో మంచు లక్ష్మీ పేరు అంటే అందరికి తెలిసే ఉంటుంది.. ప్రముఖ నటులు మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీకి పరిచయమైనా తర్వాత తన సొంత టాలెంట్‌తో స్టార్ ఇమేజ్‌ను అందుకుంది. నటన పరంగా మంచి గుర్తింపు దక్కించుకున్న లక్ష్మీ పలు సహాయక కార్యక్రమాల్లో కూడా ముందు ఉంటుంది. దీంతో ఆమెకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ భారీగానే ఉంటుంది. ఒకవైపు సినిమాల్లో కనిపిస్తూనే మరో వైపు పలు బుల్లితెర షోలలో కూడా మెప్పిస్తుంది. తాజాగా ఆమె టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్ల గురించి మాట్లాడింది.

(ఇదీ చదవండి: టీజర్‌పై ప్రభాస్‌ ఫ్యాన్స్‌ అసంతృప్తి ..సలార్‌ క్యాప్షన్‌కు అర్థం తెలుసా?)

తెలుగు పరిశ్రమకు రాక ముందు పలు హాలీవుడ్ సినిమాలకు పని చేసినట్లు చెప్పింది. అక్కడే ఉండుంటే ఈ పదేళ్లలో ఎక్కడో ఉండేదాన్ని.. ఇక్కడికి ఎందుకొచ్చానో అని కూడా అనిపిస్తుందని ఆమె తెలిపింది. ఆ దేవుడు దయ తలచితే మళ్లీ హాలీవుడ్‌కి వెళ్లేందుకు రెడీగా ఉన్నాని తెలిపింది. ఇక్కడి తెలుగు ఆడియన్స్ వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్లనే ఎక్కువగా ఇష్టపడుతారు. కానీ వారి సొంత రాష్ట్రాలకు చెందిన వారిని మాత్రం ఆదరించరని మంచు లక్ష్మీ పేర్కొంది. ఇక్కడివారిని ఒక్కశాతం ప్రేమించినా వాళ్లు ఎక్కడో ఉంటారని తెలిపింది.  

(ఇదీ చదవండి: పెళ్లి కూతురి లుక్​లో​ సమంత.. వీడియో వైరల్‌)

ఇక్కడే పుట్టిన నిహారిక ఎందుకు సినిమాలు చేయడం లేదు.. బిందు మాధవి ఎందుకు చేయడం లేదు..  మధుశాలినితో పాటు శివాత్మిక,శివాని ఎందుకు చేయడం లేదు.. .. అని ఆమె ప్రశ్నించింది. వీరందరూ దేనిలో తక్కవ అందంతో పాటు టాలెంట్‌ ఉన్న వారే కదా అంటూ ఫైర్‌ అయింది. ఇక్కడి ప్రేక్షకులతో పాటు సినిమా మేకర్స్‌కు కూడా  ముంబయి,పంజాబీ,కేరళ, తమిళ, కన్నడ హీరోయిన్లే కావాలి.. కానీ తెలుగు వారు మాత్రం వద్దంటారని ఫైర్‌ అయింది. మంచు లక్ష్మీ చేసిన కామెంట్స్‌ నిజమే కదా అంటూ నెటిజన్లు ఆమెకు మద్దతుగా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement