'సలార్' నుంచి మరో ట్రైలర్.. ఈసారి యాక్షన్ మాత్రం వేరే లెవల్! | Salaar Release Telugu Trailer - Sakshi
Sakshi News home page

Salaar Movie Trailer: కొత్త ట్రైలర్.. యాక్షన్‌తో దంచికొట్టిన ప్రభాస్!

Dec 18 2023 2:07 PM | Updated on Dec 18 2023 5:00 PM

Salaar Movie New Action Trailer Prabhas - Sakshi

డార్లింగ్ ప్రభాస్ 'సలార్' నుంచి మరో ట్రైలర్ వచ్చింది. డిసెంబరు 1న తొలి ట్రైలర్ రిలీజ్ చేయగా.. దీన్ని స్టోరీకి తగ్గట్లు కట్ చేశారు. కానీ ఇందులో ప్రభాస్ ఎంట్రీ లేటుగా ఉండటం, ఫైట్ సీన్స్-పంచ్ డైలాగ్స్ లాంటివి లేకపోవడంతో ఫ్యాన్స్ పూర్తిగా డిసప్పాయింట్ అయ్యారు. ఇదే విషయమై సోషల్ మీడియా అంతా గోలగోల చేశారు. ఇప్పుడు వీళ్లని సంతృప్తి పరిచేందుకు కొత్త ట్రైలర్‌ని ఇప్పుడు విడుదల చేశారు.

(ఇదీ చదవండి: Bigg Boss 7: శివాజీకి బొమ్మ చూపించిన బిగ్‌బాస్.. చివరకు అదొక్కటే మిగిలింది!)

తొలి ట్రైలర్‌తో పోలిస్తే దీన్ని యాక్షన్‌తో నింపేశారు. దాదాపుగా అంతా ప్రభాసే కనిపించాడు. అలానే యాక్షన్ సీన్స్ దట్టించారు. ఇప్పుడు ఇది అభిమానుల్ని సంతృప్తి పరచడంతో పాటు సినిమాపై అంచనాలని పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. డిసెంబరు 22న 'సలార్' మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇద్దరు స్నేహితులు.. బద్ధ శత్రువులు ఎలా అయ్యారనే స్టోరీతో ఈ సినిమాని తీసినట్లు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇప్పటికే బయటపెట్టడం విశేషం.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు)

Advertisement
 
Advertisement
Advertisement