ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు | Upcoming OTT Release Movies Telugu December 3rd Week 2023 | Sakshi
Sakshi News home page

This Week OTT Release Movies: ఓటీటీల్లో ఈ ఒక్క వారం 30 మూవీస్ రిలీజ్.. అవి మాత్రం స్పెషల్!

Dec 18 2023 9:14 AM | Updated on Dec 18 2023 11:30 AM

Upcoming OTT Release Movies Telugu December 3rd Week 2023 - Sakshi

డార్లింగ్ ప్రభాస్ అభిమానులు చాలారోజుల నుంచి ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది. ఎందుకంటే ఈ శుక్రవారమే 'సలార్' మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతుంది. పెద్దగా ప్రమోషన్ లాంటి హడావుడి ఏం లేకుండానే వస్తున్నప్పటికీ.. అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. దీన్ని ఢీకొట్టడానికి షారుక్ 'డంకీ', హాలీవుడ్ మూవీ 'ఆక్వామన్ 2' కూడా ఇదే వీకెండ్‌లో బిగ్ స్క్రీన్‌పై రిలీజ్ కానున్నాయి.

(ఇదీ చదవండి: Bigg Boss 7: అమర్‌దీప్ కారుపై రైతుబిడ్డ ఫ్యాన్స్ దాడి.. అద్దాలు ధ్వంసం)

ప్రభాస్, షారుక్‌ మధ్య జరిగే బాక్సాఫీస్ ఫైట్‌లో ఎవరు గెలుస్తారా అనేది పక్కనబెడితే.. ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 30 వరకు సినిమాలు-వెబ్ సిరీసులు రిలీజ్ కానున్నాయి. అయితే ఓటీటీల్లో వచ్చే వాటిలో 'ఆదికేశవ', 'సప్త సాగరాలు దాటి సైడ్-బి', 'ఫలిమి' తదితర మూవీస్ ఆసక్తి కలిగిస్తున్నాయి. అలానే పలు హిందీ, ఇంగ్లీష్ సిరీసులు కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలో రానుందనేది చూద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే మూవీస్ (డిసెంబరు 18-24 వరకు)

నెట్‌ఫ్లిక్స్

  • హలో ఘోస్ట్ (మాండరిన్ మూవీ) - డిసెంబరు 18
  • ద రోప్ కర్స్ 3 (మాండరిన్ సినిమా) - డిసెంబరు 18
  • సిండీ లా రెజీనా: ద హై స్కూల్ ఇయర్స్ (స్పానిష్ సిరీస్) - డిసెంబరు 20
  • మ్యాస్ట్రో (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 20
  • ద టేమింగ్ ఆఫ్ ష్రూడ్ 2 (పోలిష్ సినిమా) - డిసెంబరు 20
  • అల్హమర్ H.A (అరబిక్ మూవీ) - డిసెంబరు 21
  • లైక్ ఫ్లవర్స్ ఇన్ సాండ్ (కొరియన్ సిరీస్) - డిసెంబరు 21
  • రెబల్ మూన్ పార్ట్ 1: ఏ చైల్డ్ ఆఫ్ ఫైర్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 21
  • ఆదికేశవ (తెలుగు మూవీ) - డిసెంబరు 22
  • కర్రీ & సైనైడ్: ద జాలీ జోసెఫ్ కేస్ (హిందీ సిరీస్) - డిసెంబరు 22
  • యోంగ్‌సాంగ్ క్రియేచర్ (కొరియన్ సిరీస్) - డిసెంబరు 22
  • కుయికో (తమిళ మూవీ) - డిసెంబరు 22
  • ఏ వ్యాంపైర్ ఇన్ ద ఫ్యామిలీ (పోర్చుగీస్ సినిమా) - డిసెంబరు 24
  • పింక్ ఫాంగ్ సింగ్-అలాంగ్ మూవీ 3: క్యాచ్ ద జింజర్ బ్రెడ్ మ్యాన్ (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 24

హాట్‌స్టార్

  • ఫలిమి (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 18
  • BTS మాన్యుమెంట్స్: బియాండ్ ద స్టార్ (కొరియన్ సిరీస్) - డిసెంబరు 20
  • డ్రాగన్స్ ఆఫ్ వాండర్ హ్యాచ్ (జపనీస్ సిరీస్) - డిసెంబరు 20
  • పెర్సీ జాక్సన్ అండ్ ఒలింపియన్స్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 20
  • వాట్ ఇఫ్..?: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 22

అమెజాన్ ప్రైమ్

  • మిషన్ స్టార్ట్ Ab (హిందీ సిరీస్) - డిసెంబరు 19
  • ద ఏసెస్ (ఇండోనేసియన్ మూవీ) - డిసెంబరు 21
  • డ్రై డే (హిందీ సినిమా) - డిసెంబరు 22
  • సాల్ట్ బర్న్ (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 22
  • సప్త సాగరాలు దాటి సైడ్-బి (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 22

జీ5

  • అడి (మలయాళ మూవీ) - డిసెంబరు 22
  • హోమోరస్లీ యూవర్స్: సీజన్ 3 (హిందీ సిరీస్) - డిసెంబరు 22

జియో సినిమా

  • బార్బీ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 21
  • హే కమీని (హిందీ మూవీ) - డిసెంబరు 22

బుక్ మై షో

  • ద మిరాకిల్ క్లబ్ (ఇంగ్లీష్ మూవీ)  - డిసెంబరు 19

లయన్స్ గేట్ ప్లే

  • ఫియర్ ద నైట్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 22

(ఇదీ చదవండి: Bigg Boss 7: ఈ సీజన్ విన్నర్ నేనే.. శివాజీ తలతిక్క కామెంట్స్!)

Advertisement
 
Advertisement
Advertisement