Naga Babu: సాక్షి.. విలన్‌గా నాగబాబు.. ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌

Sakshi Movie: Naga Babu As Villain, First Look Out Now

సూపర్‌స్టార్ కృష్ణ‌, విజ‌య‌నిర్మల ఫ్యామిలీ నుంచి శ‌రణ్ కుమార్ హీరోగా ప‌రిచయం అవుతున్న చిత్రం సాక్షి. ఈ  సినిమాలో హీరో లుక్ ఇది వరకే రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది. శివ కేశ‌న కుర్తి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ వెన్నెల క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మునగాల సుధాక‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేడు (ఆగస్ట్ 22) మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి నాగబాబు పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.

సాక్షి టైటిల్ లోగోను, అలాగే విలన్‌గా నటిస్తున్న నాగబాబు పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, బెక్కెం వేణు గోపాల్, దాము సంయుక్తంగా విడుదల చేశారు. అనంతరం నిర్మాత మునగాల సుధాక‌ర్ రెడ్డి మాట్లాడుతూ .. ‘అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మా సాక్షి సినిమాలో విలన్‌గా నటించిన నాగబాబు పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ లోగోను రిలీజ్ చేసిన నిర్మాతలు దిల్ రాజు గారికి, బెక్కెం వేణు గోపాల్ గారికి, దాము గారికి  చాలా థాంక్స్. సినిమా చాలా బాగా వచ్చింది. ఇందులో హీరోయిన్ జాహ్నవి కపూర్. అజయ్, ఇంద్రజ, ఆమని కీలకపాత్రల్లో నటించారు. భీమ్స్ గారి సంగీతం బాగా వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది’ అన్నారు.

చదవండి: సాలెపురుగును చూసి హడలెత్తిన హీరో, ఇల్లు అమ్మేస్తానంటూ కామెంట్‌
Chiranjeevi- Surekha: చూపులు కలవకుండానే పెళ్లి చేసుకున్న చిరంజీవి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top