 
													
"యస్.ఆర్ కల్యాణ మండపం" తర్వాత శంకర్ పిక్చర్స్ తో దేవరాజ్ పొత్తూరు నిర్మిస్తున్న మాస్ ఎంటర్ టైనర్ "వెయ్ దరువెయ్". "బంపర్ ఆఫర్" తర్వాత అలాంటి బాడీ లాంగ్వేజ్ ఉన్న కథ లభించడం నా అదృష్టం. "వెయ్ దరువెయ్" టైటిల్ లోనే మాస్ కనిపిస్తుంది. లవ్, యాక్షన్, సెంటిమెంట్ ఉన్న ఈ సినిమా నాకు చాలా మంచి సినిమా అవుతుంది అన్నారు.
సాయి రామ్ శంకర్, యషా శివకుమార్ జంటగా నవీన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వెయ్ దరువెయ్. శంకర్ పిక్చర్స్ సమర్పణలో సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దేవరాజ్ పొత్తూరు నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన హీరో శర్వానంద్ హీరో, హీరోయిన్‌లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, హీరో అల్లరి నరేష్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. హీరో విశ్వక్ సేన్ గౌరవ దర్శకత్వం వహించారు.
అనంతరం హీరో సాయి రామ్ శంకర్ మాట్లాడుతూ.. "యస్.ఆర్ కల్యాణ మండపం" తర్వాత శంకర్ పిక్చర్స్ తో దేవరాజ్ పొత్తూరు నిర్మిస్తున్న మాస్ ఎంటర్ టైనర్ "వెయ్ దరువెయ్". "బంపర్ ఆఫర్" తర్వాత అలాంటి బాడీ లాంగ్వేజ్ ఉన్న కథ లభించడం నా అదృష్టం. "వెయ్ దరువెయ్" టైటిల్ లోనే మాస్ కనిపిస్తుంది. లవ్, యాక్షన్, సెంటిమెంట్ ఉన్న ఈ సినిమా నాకు చాలా మంచి సినిమా అవుతుంది అన్నారు.
చిత్ర దర్శకుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ... ఈ సినిమాలో కాశీ గారు ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నారు, ఇంకా ఈ సినిమాలో పోసాని, సప్తగిరి ఇలా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. వీరితో పాటు మంచి టెక్నీషియన్స్ దొరికారు అన్నారు. ఈ కార్యక్రమానికి హీరో ఆకాష్ పూరి , నిర్మాత , కోడి దివ్య దీప్తి హాజరయ్యారు.
The Crazy Hero 🌟ing: @sairaamshankar
— Ms.திவ்யா 💙 (@naandivya) June 24, 2022
Beautiful @yashashivakumar in
🎬@doddanaveen
direction Project takes off in a while💥
Muhurtham & Pooja Ceremony of Producer @actordevaraj
💰#saitejaentertainments
🎥#satishmuthyala
🎼#BheemsCeciroleo
Production No.2 @ 8.33AM today🪔 pic.twitter.com/MQQXMz7g7F
చదవండి: ఈ సినిమాలో నటించిన సూర్య, షారుక్‌లు ఒక్క పైసా తీసుకోలేదు
'కరణ్ అర్జున్' సినిమా రివ్యూ..

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
