'ఒక పథకం ప్రకారం' టీజర్‌ రిలీజ్‌ చేసిన రవితేజ | Raviteja Launched Sairam Shankar Oka Pathakam Prakaram Teaser | Sakshi
Sakshi News home page

Oka Pathakam Prakaram: రామ-రావణ పాత్రలో సాయిరామ్‌ శంకర్‌..

Jun 3 2022 8:29 AM | Updated on Jun 3 2022 8:53 AM

Raviteja Launched Sairam Shankar Oka Pathakam Prakaram Teaser - Sakshi

సాయిరామ్‌ శంకర్, అశీమా నర్వాల్‌ జంటగా నటించిన చిత్రం ‘ఒక పథకం ప్రకారం’. జాతీయ అవార్డుగ్రహీత వినోద్‌ విజయన్‌ దర్శకత్వం వహించారు. వినోద్‌ విజయన్‌ ఫిలిమ్స్, విహారి సినిమా హౌజ్‌పై వినోద్‌ విజయన్, రవి పచ్చముత్తు, గార్లపాటి రమేష్‌ నిర్మించారు.

Raviteja Launched Sairam Shankar Oka Pathakam Prakaram Teaser: సాయిరామ్‌ శంకర్, అశీమా నర్వాల్‌ జంటగా నటించిన చిత్రం ‘ఒక పథకం ప్రకారం’. జాతీయ అవార్డుగ్రహీత వినోద్‌ విజయన్‌ దర్శకత్వం వహించారు. వినోద్‌ విజయన్‌ ఫిలిమ్స్, విహారి సినిమా హౌజ్‌పై వినోద్‌ విజయన్, రవి పచ్చముత్తు, గార్లపాటి రమేష్‌ నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ని హీరో రవితేజ విడుదల చేశారు. సినిమాని ఈ నెల 24న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. 

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఇందులో రామ–రావణ తరహా పాత్రలో నటించారు సాయిరామ్‌ శంకర్‌’’ అన్నారు. కాగా ఇంతకుముందు ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను రామ్‌గోపాల్‌ వర్మ విడుదల చేశారు. శృతీ సోధి, సముద్రఖని, కళాభవన్‌ మణి, భాను శ్రీ నటించిన ఈ చిత్రానికి రాహుల్‌ రాజ్‌ సంగీతం అందించగా రాజీవ్‌ రవి, వినోదిల్లంపల్లి, సురేష్‌ రాజన్‌ కెమెరా వర్క్స్‌ చేశారు. 

చదవండి: 'బ్లైండ్‌'గా వచ్చేస్తున్న హీరోహీరోయిన్లు..

Advertisement
 
Advertisement
Advertisement