సాయిపల్లవే అనుకుంటే ఆమె చెల్లి ఇంకా తోపు! వీడియో వైరల్‌ | Sakshi
Sakshi News home page

Pooja Kannan: సాయిపల్లవి సోదరి వీడియో.. అక్కనే మించిపోయిందిగా!

Published Sun, Jan 28 2024 1:34 PM

Sai Pallavi Sister Pooja Kannan Teenmar Dance at Her Engagement - Sakshi

హీరోయిన్స్‌ అన్నాక అన్ని పాత్రలు చేయాలి.. అన్ని రకాల డ్రెస్సులూ ధరించాల్సి ఉంటుంది. కానీ కొందరు మాత్రం ఎక్స్‌పోజింగ్‌ డ్రెస్సుల జోలికి అస్సలు పోరు. ట్రెడిషనల్‌ దుస్తుల్లోనే కనిపిస్తూనే ఉంటారు. అందులో సాయి పల్లవి ఒకరు. సహజ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ అందరు హీరోయిన్లలా ఏ సినిమా పడితే ఆ సినిమా చేయదు. కథ నచ్చాలి, తన పాత్రలో దమ్ముండాలి.. అప్పుడే ఆ సినిమాకు సంతకం చేస్తుంది. అందుకే చాలామందికి ఈ హీరోయిన్‌ స్పెషల్‌.

త్వరలో పెళ్లి
ఇక ఈ బ్యూటీ ఇంట త్వరలో బాజా భజంత్రీలు మోగనున్న సంగతి తెలిసిందే! సాయిపల్లవి సోదరి పూజా కన్నన్‌ పెళ్లి పీటలెక్కనుంది. ఈ మధ్యే ఎంతో గ్రాండ్‌గా నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకలో కూడా హీరోయిన్‌, ఆమె సోదరి ఎంతో సింపుల్‌గా కనిపించారు. అంతేనా.. మాస్‌ పాటలు పెట్టుకుని ఫ్యామిలీ మొత్తం తీన్మార్‌ డ్యాన్స్‌ చేసింది. సాయిపల్లవే అనుకుంటే ఆమెను మించిపోయేలా స్టెప్పులేసింది పూజా.

అక్కను మించిపోయిందిగా
కాబోయే భర్తతో కలిసి ఫుల్‌ జోష్‌తో చిందేసింది. ఈ వీడియోను పూజా సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా క్షణాల్లో వైరల్‌గా మారింది. 'నిశ్చితార్థాన్ని ఇంత బాగా ఎంజాయ్‌ చేస్తారా..', 'ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంటే మీలా చేసుకోవాలి..', 'వామ్మో.. ఈ వీడియోలో పూజా.. సాయిపల్లవిని డామినేట్‌ చేసింది' అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

సినిమాల సంగతి..
'ప్రేమమ్' అనే మలయాళ చిత్రంతో వెండితెరకు హీరోయిన్‌గా పరిచయమైంది సాయిపల్లవి. ఆ తర్వాత తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించింది. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా, తెలుగులో 'తండేల్' చేస్తోంది.

చదవండి: బాటిల్‌ కోసం వ్యక్తిని చెప్పుతో కొట్టిన పాపులర్‌ సింగర్‌.. వీడియో వైరల్‌
అయోధ్యలోనే పెళ్లి చేసుకుంటానంటున్న నటుడు

Advertisement
Advertisement