కొత్త కథలతో ఎస్‌ ఒరిజినల్స్‌.. ఏకంగా 9 సినిమాలు | S Originals Coming With 9 Movies With Different Concepts | Sakshi
Sakshi News home page

S Originals: కొత్త కథలతో ఎస్‌ ఒరిజినల్స్‌.. ఏకంగా 9 సినిమాలు

Jan 4 2022 12:28 PM | Updated on Jan 4 2022 12:31 PM

S Originals Coming With 9 Movies With Different Concepts - Sakshi

S Originals Coming With 9 Movies With Different Concepts: ఈ సంవత్సరం ఏకంగా 9 సినిమాలను నిర్మించేందుకు సిద్ధం అవుతుంది 'ఎస్‌ ఒరిజనల్స్‌'. డిఫరెంట్‌ కాన్సెప్ట్స్‌తో కథను నమ్మి కొత్త తరం దర్శకులను ఎంకరేజ్‌ చేస్తున్నారు నిర్మాత సృజన్‌. తమ సంస్థ నుంచి వస్తున్న సినిమాలపై గురించి సృజన్ మాట్లాడుతూ 'ఎస్‌ ఒరిజినల్స్‌ను టాలీవుడ్‌లో ప్ర‌త్యేక స్థానంలో నిలుపాల‌న్న‌దే నా కోరిక‌. ఇప్పటి వరకు భాగస్వామ్యంలో కొన్ని సినిమాలను నిర్మించడం జరిగింది. కానీ ఇప్పుడు మా బ్యానర్‌ నుంచే 9 చిత్రాలు విడుదల కానున్నాయి. ఈ సినిమాల షూటింగ్‌ సుమారు ముగింపునకు రావడం సంతోషంగా ఉంది. దీని ద్వారా కొత్త దర్శకులు ప‌రిచ‌యం కాబోతున్నారు. టాలెంట్‌పై న‌మ్మ‌కంతో వారిని ప్రోత్స‌హిస్తున్నాం. ఇవే కాకుండా మ‌రికొన్ని క‌థ‌ల‌ను ఫైన‌లైజ్ చేసి ఈ ఏడాది ప్రారంభిస్తాం' అని తెలిపారు.  

ప్రస్తుతం పంచతంత్రం విడుదలకు సిద్ధంగా ఉందని సృజన్‌ పేర్కొన్నారు. 'సంతోష్ శోభన్‌ హీరోగా డిజిటల్‌ మీడియాలో బ్రాండ్‌గా ఎదిగిన సుభాష్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ ఒక అందమైన ప్రేమకథను రూపొదించాం. సుమంత్‌ హీరోగా అహాం చిత్రం షూటింగ్‌ ఆఖరి షెడ్యూల్‌ జరుగుతోంది. బ్రహ్మానందం తనయుడు గౌతమ్‌ హీరోగా షూటింగ్ మొదటి షెడ్యూల్‌ పూర్తయిన సినిమాతో సుబ్బు చెరుకూరిని కొత్త దర్శకుడిగా అరంగ్రేటం చేయనున్నారు. ఇంకొక కొత్త దర్శకుడిగా బ్రిజేష్‌తో వైరల్‌ సినిమా రానుంది. కిరణ్‌ డైరెక్షన్‌లో మరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. కన్నడలో బీర్బల్‌ ట్రయాలజీ తీసిన శ్రీని దర్శకత్వంలో ఓల్డ్‌ మంక్‌ మూవీని, కొత్త దర్శకుడు విష్ణును మరో సినిమాతో పరిచయం చేస్తున్నాం. బాలీవుడ్ పాపుల‌ర్ రైట‌ర్స్ సిద్దార్ధ , గ‌రీమ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందున్న దుకాన్ మూవీ షూటింగ్‌ చివరి షెడ్యూల్‌లో ఉంది.' అని సృజన్‌ వెల్లడించారు.

కొత్త కాన్సెప్ట్‌లతో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటాయ‌నే న‌మ్మ‌కం బ‌లంగా ఉందని నిర్మాత సృజన్ ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త టాలెంట్‌ను ప్రోత్స‌హించ‌డంలో ఎస్‌ ఒరిజిన‌ల్స్ సంస్థ ఎప్పుడూ ముందు ఉంటుందన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement