కొత్తవారి కోసమే దిల్‌ రాజు డ్రీమ్స్‌: ‘దిల్‌’ రాజు | dil raju announced his new production house dil raju dreams: Tollywood | Sakshi
Sakshi News home page

కొత్తవారి కోసమే దిల్‌ రాజు డ్రీమ్స్‌: ‘దిల్‌’ రాజు

Nov 12 2024 2:58 AM | Updated on Nov 12 2024 2:58 AM

dil raju announced his new production house dil raju dreams: Tollywood

‘‘చిత్ర పరిశ్రమలో కొత్త వాళ్లను, కొత్త కంటెంట్‌ను ప్రోత్సహించేందుకే ‘దిల్‌ రాజు డ్రీమ్స్‌’ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించాను. దర్శక, నిర్మాతలు, హీరో, హీరోయిన్లు, రచయితలు.. ఇలా ఆసక్తి ఉన్న ఎవరైనా మా టీమ్‌ని సంప్రదించవచ్చు. ఇందుకోసం నా బర్త్‌డే(డిసెంబరు 18) లేదా జనవరి 1న వెబ్‌ సైట్‌ను ప్రారంభిస్తాం’’ అని నిర్మాత ‘దిల్‌’ రాజు అన్నారు. సోమవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ‘దిల్‌ రాజు డ్రీమ్స్‌’ లోగోను ఆయన విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘ఇండస్ట్రీలో చాలా చిత్రాలు వస్తున్నట్టుగా, పోయినట్టుగా కూడా ఎవరికీ తెలీదు. ఎంత డబ్బు వృథాగా పోతోందో నాకు తెలుసు.

అందుకే ఈ డ్యామేజ్‌ని కంట్రోల్‌ చేయాలని, ప్రతిభ ఉన్న కొత్తవారికి సరైన వేదిక ఉండాలని ‘దిల్‌ రాజు డ్రీమ్స్‌’ను స్థాపించాను. ఇప్పటికే ఇద్దరు ఎన్నారై నిర్మాతలు ‘దిల్‌ రాజు డ్రీమ్స్‌’ ద్వారా రెండు ప్రాజెక్టులు చేస్తున్నారు. ఈ సంస్థ కార్పోరేట్‌ స్టైల్‌లో ఉంటుంది. ఇక్కడ పనిచేసే వారందరికీ జీతాలు ఇస్తాం. ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తాం.. వాటిలో కచ్చితంగా రెండు అయినా హిట్‌ కావాలని షరతు విధించాను. మంచి ప్రతిభావంతులకు నా బ్యానర్‌లో సినిమా చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ ఎలాంటి సిఫారసులు ఉండవు. అందరూ వెబ్‌ సైట్‌ ద్వారానే సంప్రదించాలి’’ అని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement