RRR Movie: Ram Charan Gifted 10 Grams Gold Coin to Movie Crew - Sakshi
Sakshi News home page

Ram Charan: ఆర్‌ఆర్‌ఆర్‌ టీంకు తులం బంగారం, కేజీ స్వీట్‌ బహుమతి

Apr 3 2022 6:33 PM | Updated on Apr 3 2022 6:55 PM

RRR Movie: Ram Charan Gifted 10 Grams Gold Coin To Movie Crew - Sakshi

Ram Charan Gifted 10 Grams Gold Coins To RRR Crew: ‘ఆర్ఆర్ఆర్’.. సినిమా రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ ప్రభంజనం కనిపిస్తుంది. ఉత్తరాదిన ఊహించని స్పందన రావడం, అక్కడ వసూళ్లు మరింత స్ట్రాంగ్‌గా ఉండటంతో ఆర్ఆర్ఆర్ మూవీ కలెక్షన్లపరంగా దూసుకుపోతోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ మూవీ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఎనిమిది రోజుల్లోనే ఏడు వందల కోట్లకు పైగా వసూలు చేసి రికార్డులు క్రియేట్‌ చేసింది.

చదవండి: బంజారాహిల్స్‌ రేవ్‌ పార్టీ: వివరణ ఇచ్చిన రాహుల్‌ సిప్లిగంజ్‌

ఈ సినిమా ఇంత సక్సెస్ కావడంతో ఒకపక్క హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్య సహా సినిమాలో భాగమైన అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా తన మంచి తనాన్ని చాటుకున్నారు. సినిమా కోసం పని చేసిన వివిధ శాఖలకు చెందిన హెచ్ఓడీలను ఈ ఉదయం అల్పాహారం కోసం పిలిపించి వారందరికీ ఊహించని బహుమతి అందించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా కోసం పని చేసిన వివిధ విభాగాల అధిపతులను, కెమెరా అసిస్టెంట్లను, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌ అసిస్టెంట్లను, మేనేజర్లను, అకౌంటెంట్లను, స్టిల్ ఫోటోగ్రాఫర్ అసిస్టెంట్లను ఇలా దాదాపు అన్ని విభాగాలకు చెందిన సుమారు 35 మందిని ఇంటికి ఆహ్వానించారు.

చదవండి: నిహారికపై వస్తున్న వార్తలపై నాగబాబు స్పందన..

ఈ సందర్భంగా వారిని అల్పాహారం విందు కోసం ఆహ్వానించిన చరణ్‌ వారితో కాస్త సమయం గడిపారు. అనంతరం వారందరికీ ఒక్కొకరికి ఒక్కో తులం(10 గ్రాముల) బంగారం కాయిన్ కానుకగా ఇవ్వడమే కాకుండా ఒక కేజీ స్వీట్ బాక్స్ కూడా అందించి సినిమా కోసం పని చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. సినిమా ఇంత అద్భుతంగా రావడంలో వారి పాత్ర కూడా ఉందని ఈ సందర్భంగా రామ్ చరణ్ వారందరని కొనియాడాడు. సినిమా ఘనవిజయం సాధించిన సందర్భంగా రామ్ చరణ్ సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement