వామ్మో 'ఆర్‌ఆర్‌ఆర్'‌‌కు ఓ రేంజ్‌లో బిజినెస్‌!

RRR Movie Pre Release Business Rs. 900 Crores - Sakshi

చరిత్రలో ఎన్నడూ కలవని స్వాతంత్ర్య సమరయోధులు ఓ మంచి పని కోసం ఏకమైతే ఎలా ఉంటుంది? అన్న కాన్సెప్ట్‌తో వస్తున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌(రౌద్రం రణం రుధిరం). కొమురం భీమ్‌గా జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రీ రిలీజ్‌ లెక్కలు జనాలకు షాక్‌నిస్తున్నాయి. దీని థియేట్రికల్‌ హక్కులు ఏకంగా రూ.570 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. డిజిటల్‌, శాటిలైట్‌ హక్కుల పేరిట అప్పుడే రూ.300 కోట్లు వచ్చాయట.  బాలీవుడ్‌కు చెందిన పెన్ స్టూడియోస్ సంస్థ ఈ సినిమా నార్త్ ఇండియా థియేట్రికల్ హక్కులతో పాటు భారతీయ భాషల డిజిటల్, శాటిలైట్, ఎలక్ట్రానిక్ హక్కులను సొంతం చేసుకుంది.

ఈ పీరియాడికల్‌ మూవీకి ఆంధ్రా, నైజాం ఏరియాలో రూ. 240 కోట్ల బిజినెస్‌ జరిగినట్లు తెలుస్తోంది. ఇక హిందీలో రూ.140 కోట్లు, దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడులో రూ.48 కోట్లు, కర్ణాటకలో రూ.45 కోట్లు, కేరళలో రూ.15 కోట్ల మేర ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరిగిందట. అలాగే ఓవర్సీస్‌లో రూ.70 కోట్లకు ఆర్‌ఆర్‌ఆర్‌ హక్కులు అమ్ముడుపోయినట్లు సమాచారం. మ్యూజిక్‌ రైట్స్‌కు మరో రూ.20 కోట్లు సాధించినట్లు టాక్‌. మొత్తంగా ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రీరిలీజ్‌ బిజినెస్‌ దాదాపు రూ.900 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో రాజమౌళి 'బాహుబలి 2'కు రూ.500 కోట్ల ప్రీరిలీజ్‌ బిజినెస్‌ జరగ్గా ఆర్‌ఆర్‌ఆర్‌ ఈ రికార్డును తిరగరాసింది. దీనికంటే దాదాపు రెట్టింపు మొత్తానికి హక్కులు అమ్ముడుపోయి అందరినీ ఆశ్చర్యపరిచింది. గతంలో ఏ తెలుగు సినిమాకు ఇంత భారీ మొత్తంలో బిజినెస్‌ జరగకపోవడం విశేషం.

రాజమౌళి సినిమా అంటే సూపర్‌ హిట్టు పక్కా అని భావించిన డిస్ట్రిబ్యూటర్లు భారీ మొత్తం ఇన్వెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా బడ్జెట్‌ సుమారు రూ.400 కోట్లుగా ఉండగా.. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌తో నిర్మాతలు భారీగా లాభపడినట్లేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ భారీ మల్టీస్టారర్‌ అక్టోబర్‌ 13న దసరా పండగకు సోలోగా రిలీజ్‌ అవుతోంది. 

చదవండి: రామ్‌చరణ్‌ పోస్టర్‌: కానీ ఎన్టీఆర్‌కు విషెస్‌ చెప్పిన సింగర్

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top