Prabhas: క్లాస్‌ అయినా మాస్‌ అయినా.. మోత మోగాల్సిందే!

Rebell Hero Prabhas Famous Dialogues:Birthday Special - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ప్ర..భాస్ ఈ పేరు వింటేనే కుర్రకారు గుండెల్లో హుషారు.  దాదాపు  రెండు దశాబ్దాల కాలంగా అమ్మాయిల గుండెల్లో గుబులు రేపుతున్న డార్లింగ్‌.  42 ఏళ్లు నిండినా  ఈ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ పెళ్లెపుడు అనేది మాత్రం మిలియన్‌ డాలర్ల ప్రశ్నే.  మాస్‌.. అయినా క్లాస్‌ అయినా. స్టెప్‌ అయినా... ఫైట్‌ అయినా ప్రభాస్‌ కనిపిస్తే... థియేటర్లలో  సీటీల మోత మోగాల్సిందే. అదీ ప్రభాస్‌ అంటే.. ఫ్యాన్స్‌లో ఫుల్‌ జోష్‌ నింపిన పవర్‌ ఫుల్‌ పంచ్‌ డైలాగులు మీకోసం..  (Freida Pinto: అవును..నా డ్రీమ్‌ మ్యాన్‌ను పెళ్లి చేసుకున్నా!)

(Prabhas Birthday Special: పండగలా దిగొచ్చిన ‘డార్లింగ్‌’కు హ్యాపీ బర్త్‌డే)

‘‘టిప్పర్ లారీ వెల్లి స్కూటర్‌ని  గుడ్డేస్తే ఎలా ఉంటదో తెల్సా? అలా ఉంటది నేను గుద్దితే ​‍’’

‘‘వాడు పోతే వీడు, వీడు పోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైన అధికారం కోసం ఎగబడితే..’’

‘‘కటౌట్‌ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి  డ్యూడ్‌!’’


‘‘ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పనమ్మా !’’

‘‘నువ్వు నా వూరు రావాలంటే స్కెచ్ వేసి రావాలి ... అదే నేను నీ వూరు రావాలంటే హ్యాంగర్ కి ఉన్న చొక్కా వేసుకుంటే చాలు రా!​‍​‍’’

‘‘వీలైతే ప్రేమించండి..పొయ్యేదేముంది మహా ఐతే తిరిగి ప్రేమిస్తారు’’

‘‘నాకు అమ్మాయిలు అన్నా, సెల్ ఫోన్ లు అన్నా ఇష్టం ఉండవు, సెల్ ఫోన్ లో మెసేజ్ లు ఎక్కువ, అమ్మాయిల్లో డౌట్స్ ఎక్కువ, ఇవి మనకు సెట్ కావు"

"నాకు రామాయణం,మహాభారతం గురించి తెలియదు. అందులో ఉండే యుద్దాల గురించి తెలుసు. రండి కుమ్మేసుకుందాం.."

"సైలెంట్ కు, వైలెంట్ కు మధ్య బుల్లెట్ ఉంటుంది, నేను బుల్లెట్ ను కాదు మిస్సైల్ ని.." 

"నా హైట్ 6 ఫీట్ 2 ఇంచెస్, నా బలువు 100 ఫీట్స్ చూస్తావా, మా అమ్మ నన్ను ముద్దుగా ఈఫిల్ టవర్ అని పిలుస్తుంది. ఈఫిల్ టవర్ ని ప్రీగా చూసుకో పర్లేదు, కానీ నా బలువు చూడాలంటే నీ ప్రాణం ఇవ్వాలి.." 

"ఒక్కడు ఎదురు తిరిగితే తిరుగుబాటు.... అదే వంద మంది ఎదురు తిరిగితే అది పోరాటం"  

"చరిత్రలో నిలిచిపోయిన ఏ పోరాటం అయినా, వెనక ఉన్న వంద మంది గురించి చెప్పుకోలేదు... ముందుండి నడిపించిన ఒక్కడిని గురించి మాట్లాడుకున్నారు"

‘‘నేనెవర్నీ..

నాతో వచ్చెదెవరు నాతో చచ్చేదెవరు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top