Hero Ravi Teja Manager Srinivas Raju Buys New Car, Video Viral - Sakshi
Sakshi News home page

ఇదంతా మీ వల్లే సాధ్యమైంది.. ఆ క్షణాలు నాకెంతో ప్రత్యేకం: రవితేజ అసిస్టెంట్‌ భావోద్వేగం

Dec 6 2022 8:47 PM | Updated on Dec 7 2022 8:48 AM

Ravi Teja Assistant Srinivas Raju Buys New Car, Shares Video - Sakshi

ఊరిలో సైకిల్‌ తొక్కిన నేను ఇప్పుడు కారు కొనుక్కున్నాను. అంతా మీ వల్లే జరిగింది. మీతో కలిసి ఎన్నో మైళ్లు ప్రయాణించి ఉండొచ్చు. కానీ మీరు నా కారు నడుపుతున్నప్పుడు మీ పక్క కూర్చుని ప్రయాణించిన

మాస్‌ మహారాజ రవితేజ ఫుల్‌ స్పీడు మీదున్నాడు. గ్యాప్‌ లేకుండా వరుస సినిమాలు కంప్లీట్‌ చేసుకుంటూ పోతున్నాడు. ప్రస్తుతం రవితేజ నటించిన ధమాకా మూవీ ఈ నెల 23న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే రవితేజ దగ్గర అసిస్టెంట్‌గా పని చేస్తున్న శ్రీనివాస రాజు సొంతంగా ఓ కారు కొన్నాడు. ఈ విషయాన్ని ఆయన సోషల్‌ మీడియా వేదికగా తెలుపుతూ ఎమోషనలయ్యాడు.

'ఊరిలో సైకిల్‌ తొక్కిన నేను ఇప్పుడు కారు కొనుక్కున్నాను. అంతా మీ వల్లే జరిగింది. మీతో కలిసి ఎన్నో మైళ్లు ప్రయాణించి ఉండొచ్చు. కానీ మీరు నా కారు నడుపుతున్నప్పుడు మీ పక్క కూర్చుని ప్రయాణించిన ఆ కొన్ని కిలోమీటర్లు నాకెంతో ప్రత్యేకం. నా సర్వస్వం మీరే అయిన మాస్‌ గాడ్‌ రవితేజకు ప్రత్యేక కృతజ్ఞతలు. నా ఈ జీవితం మీకు అంకితం' అని రాసుకొచ్చాడు.

చదవండి: ఆ సౌత్‌ హీరోకి ఫోన్‌ చేసి ఒక్క ఛాన్స్‌ అడిగా: జాన్వీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement