ఈ చిత్రంతో ఆగిపోను | Ravana Lanka Movie Press Meet | Sakshi
Sakshi News home page

ఈ చిత్రంతో ఆగిపోను

Oct 16 2020 1:04 AM | Updated on Oct 16 2020 1:04 AM

Ravana Lanka Movie Press Meet - Sakshi

‘‘రావణలంక’ లాంటి మంచి చిత్రాల్ని ప్రేక్షకులందరూ ఆదరించాలి. సినిమాపై ఆసక్తితో క్రిష్‌ బండిపల్లి హీరోగా నటిస్తూ, నిర్మిస్తుండటం గ్రేట్‌. కొత్త హీరోలను ప్రోత్సహించడం వల్ల ఇండస్ట్రీకి మరింత మంది కొత్త హీరోలు వస్తారు’’ అని తెలంగాణ ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ చైర్మన్‌ ప్రతాని రామకృష్ణ గౌడ్‌ అన్నారు. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో మంచి వ్యాపారవేత్తగా రాణించిన క్రిష్‌ బండిపల్లి ‘రావణలంక’ చిత్రంతో హీరోగా, నిర్మాతగా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. బీఎన్‌ఎస్‌రాజు దర్శకత్వంలో కె.సిరీస్‌ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది.

నేడు క్రిష్‌ బండిపల్లి పుట్టినరోజు సందర ్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీఎన్‌ఎస్‌రాజు మాట్లాడుతూ– ‘‘రామాయణాన్ని బేస్‌ చేసుకుని తీస్తున్న చిత్రమిది. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని రెండు పాటలకు చాలా మంచి స్పందన  వచ్చింది.’’ అన్నారు. క్రిష్‌ బండిపల్లి మాట్లాడుతూ– ‘‘ఈ స్క్రిప్ట్‌ కోసం ఏడాది పని చేశాను. ఆర్‌.ఆర్‌. సత్యంగారి నేపథ్య సంగీతం బాగుంది. కచ్చితంగా చెబుతున్నా ఈ చిత్రంతో నేను ఆగిపోను.. ఇంకా ఎన్నో చిత్రాలను తీస్తాను’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ప్రసన్నకుమార్, దర్శకుడు సముద్ర, హీరోయిన్‌ గరీమా తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఉజ్జల్, కెమెరా: హజరత్‌షేక్‌ (వలి).

Advertisement
 
Advertisement
Advertisement