మరో వివాదంలో రష్మిక, ఈసారి దక్షిణాదిపై సంచలన వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: మరో వివాదంలో రష్మిక, సౌత్‌ ఇండస్ట్రీపై అవమానకర వ్యాఖ్యలు

Published Thu, Dec 29 2022 9:12 AM

Rashmika Mandanna Shocking Comments On South Industry Songs - Sakshi

దక్షిణాది స్టార్‌ హీరోయిన్‌గా ఎంతో క్రేజ్‌ను సంపాదించుకుంది రష్మిక మందన్నా. ఇక పుష్ప మూవీతో పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది. అదే క్రేజ్‌తో బాలీవుడ్‌ వరుస ఆఫర్లు అందుకుంటోంది. సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్‌డమ్‌ను ఆస్వాదిస్తున్న రష్మికకు నెట్టింట మాత్రం తరచూ చేదు అనుభవం ఎదురవుతోంది. తన తీరు ఎప్పుడు సోషల్‌ మీడియా వేదికగా ట్రోల్స్‌ ఎదుర్కొంటు ఉంటుంది. ఇటీవల రష్మీక కాంతార చిత్రం, ఆ మూవీ డైరెక్టర్‌, హీరో రిషబ్‌ శెట్టిపై చేసిన కామెంంట్స్‌ కన్నడీగులకు ఆగ్రహం తెప్పించింది.

దాంతో ఆమెపై కన్నడీగులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పటికీ ఆ వివాదం చర్చనీయాంశంగానే ఉంది. ఈ క్రమంతో తాజాగా సౌత్‌ ఇండస్ట్రీపై మరోసారి షాకింగ్‌ కామెంట్స్‌ ట్రోలింగ్‌ బారిన పడింది రష్మిక. బాలీవుడ్‌ ఆమె నటించిన తొలి చిత్రం మిషన్‌ మజ్ను నేరుగా ఓటీటీలో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్‌లో పాల్గొన్న రష్మిక మాట్లాడుతూ.. బాలీవుడ్‌పై ప్రశంసలు కురిపించింది. అదే క్రమంలో దక్షిణాది పరిశ్రమపై సంచలన కామెంట్స్‌ చేసింది. ‘సౌత్ సాంగ్స్ కంటే నార్త్ సాంగ్స్ బాగుంటాయి. చిన్నప్పటి నుంచి నేను బాలీవుడ్ సాంగ్స్ వింటూ, చూస్తూ పెరిగాను. దక్షిణాది సినిమాల్లో అన్నీ మసాలా పాటలే ఉంటాయి.

సౌత్ సినిమాల్లో ఐటెం నంబర్స్, డ్యాన్స్ నంబర్సే ఎక్కువ’ అంటూ దక్షిణాది పాటలపై ఎద్దేవా చేసింది. ఇందుకు సంబంధించిన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో రష్మిక తన లేటెస్ట్‌ కామెంట్స్‌తో మరో కొత్త వివాదంలో చిక్కుకుంది. ఆమె తీరుపై దక్షిణాది సినీ అభిమానులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం​ వ్యక్తం చేస్తున్నారు. ‘నీకు ఆఫర్లు ఇచ్చి స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చి పెట్టిన దక్షిణాది పరిశ్రమను, సినిమాలను అవమానిస్తావా?’, ‘రష్మికను కన్నడలో మాత్రమే కాదు.. సౌత్‌ ఇండస్ట్రీలోనే పూర్తిగా బ్యాన్‌ చేయాలి’ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.  

చదవండి: 
క్రేజీ ఆఫర్‌ కొట్టేసిన కల్యాణి ప్రియదర్శన్‌..!
ప్రభాస్‌తో బాలయ్య ముచ్చట‍్లు.. ప్రోమో మామూలుగా లేదుగా..!

Advertisement
 
Advertisement
 
Advertisement