UnstoppableNBKS2: ప్రభాస్‌తో బాలయ్య ముచ్చట‍్లు.. ప్రోమో మామూలుగా లేదుగా..!

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్-2 క్రేజ్ అంతా ఇంతా కాదు. ఫేమస్ సెలబ్రీటీలు హాజరవుతున్న ఈ షో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సీజన్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రభాస్, గోపీచంద్‌తో కలిసి ఈనెల 30న ప్రసారం కానున్న ఎపిసోడ్ ప్రోమో రిలీజైంది. అయితే ఈ ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా ప్రసారం చేయనుండగా తాజాగా మరో అదిరిపోయే ప్రోమోతో ఆహా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా వెల్లడించింది.
ఈ ప్రోమోలో ప్రభాస్‌ను బాలకృష్ణ సరదా ప్రశ్నలతో ముంచెత్తారు. ఈ ప్రోమో చూస్తే ఆద్యంతం నవ్వుల పూయించడం ఖాయంగా కనిపిస‍్తోంది. ఇందులో సెటైర్లు, సీక్రెట్స్, సరదాలు, సలహాలు, డ‍్యాన్సులు, సంచలనాలు, అన్ని ఉండనున్నట్లు ఆహా ట్వీట్‌లో వెల్లడించింది. దీంతో ఈ ఎపిసోడ్ కోసం ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఈనెల 30న మొదటి పార్ట్ ప్రసారం కానుండగా.. జనవరి 6న రెండో పార్ట్ ప్రసారం చేయనున్నట్లు ఆహా ప్రకటించింది.
Satirelu, Secretlu, Saradalu, Salahalu, Songulu, Dancelu, Sanchalanalu, annni unnay...😍🤯😋❤️ Anduke Bali Bali Ra Bali Sahore Bahubali in 2 Parts.
Part 1 premieres December 30.#PrabhasOnAHA #UnstoppableWithNBKS2#Prabhas𓃵 #NandamuriBalakrishna pic.twitter.com/Bqmguxmq4G— ahavideoin (@ahavideoIN) December 28, 2022
మరిన్ని వార్తలు :