Rashmika Mandanna Said She Want To Leave Social Media When Second Wave Comes - Sakshi
Sakshi News home page

రష్మిక షాకింగ్‌ నిర్ణయం, సోషల్‌ మీడియాకు గుడ్‌బై చెప్పాలనుకుందట!

Jun 12 2021 10:26 PM | Updated on Jun 13 2021 9:08 AM

Rashmika Mandanna Said She Want To Leave Social Media When Second Wave Comes - Sakshi

పరిశ్రమలోకి వచ్చిన అనతి కాలంలోనే దక్షిణాది మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా మారిపోయింది రష్మిక మందన్నా. తన క్యూట్‌ క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో రెండుసార్లు మోస్ట్‌ డిసైరబుల్‌ ఉమెన్‌గా నిలిచింది ఈ నేషనల్‌ క్రష్‌. ఇక తరచూ తనకు సంబంధించి విషయాలను, ఫొటోలను, సామాజిక అంశాలపై స్పందిస్తూ సోషల్‌ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటే రష్మికకు ఎంతటి ఫాలోయింగ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అంతేగాక తన సోషల్‌ మీడియా ఫాలోవర్స్‌ రష్మిక కొత్త పోస్టుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అలా అంతటి క్రేజ్‌ను సంపాదించుకున్నా ఆమె గతంలో ఓ షాకింగ్‌ నిర్ణయం తీసుకుందట. కరోనా సెకండ్‌ వేవ్‌కు ముందు పూర్తిగా సోషల్‌ మీడియాకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్వూలో వెల్లడించింది. అయితే కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వలో రానుందని తన టీం చెప్పడంతో అప్పుడే విషయం అర్థమైందని, అందుకే తన సోషల్‌ మీడియా ఖాతాలను డిలిట్‌ చేయాలనుకున్నట్లు తెలిపింది.

రష్మిక మాట్లాడుతూ.. ‘కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని అర్థమైంది. అవి ఎంతో బాధను ఇవ్వడం కాక, మానసిక శాంతిని దూరం చేస్తాయి. అందుకే మానసిక ప్రశాంతత కోసం సోషల్ మీడియాను విడిచిపెట్టాలని అనుకున్న. కానీ అలా చేయలేకపోయాను. ఈ సంక్షోభ సమయంలో సామాన్య ప్రజలకు సహాయం చేస్తున్న వారిలో స్ఫూర్తి నింపాలని కోరుకున్నా. అందుకే ‘spreading hope’ను ప్రారంభించాను’ అంటూ ఆమె వివరించింది. కాగా ప్రస్తుతం రష్మిక ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’లో హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనితో పాటు ఆమె బాలీవుడ్‌లో బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌తో ‘గుడ్‌బై’ మూవీ చేస్తోంది. 

చదవండి: 
ప్రేమలో పడిపోయా.. రష్మిక పోస్ట్‌ వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement