Aashiqui Movie Sequel: ‘ఆషికీ 3’లో హీరోయిన్‌గా రష్మిక మందన్నా?

Is Rashmika Mandanna Plays Female Lead Role in Aashiqui 3 Movie - Sakshi

రష్మికా మందన్నా కెరీర్‌ మంచి జోరు మీద ఉంది. ఒకవైపు దక్షిణాది సినిమాలు సైన్‌ చేస్తూ మరోవైపు ఉత్తరాదిపై కూడా దృష్టి పెట్టారీ బ్యూటీ. ఇప్పటికే హిందీలో ‘గుడ్‌ బై’, ‘మిషన్‌ మజు్న’, ‘యానిమల్‌’ వంటి చిత్రాలు ఆమె లిస్ట్‌లో ఉన్నాయి. తాజాగా ఓ హిట్‌ సీక్వెల్‌ (ఆషికీ) లో హీరోయిన్‌గా రషి్మకా దాదాపు ఖరారు అయ్యారని సమాచారం. రాహుల్‌ రాయ్, అను అగర్వాల్‌ జంటగా రూపొందిన ‘ఆషికీ’ (1990) మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

చదవండి: అయోధ్యలో ఆదిపురుష్ టీజర్ రిలీజ్.. రాముడి లుక్‌లో అదరగొట్టిన ప్రభాస్

ఆ తర్వాత పదమూడేళ్లకు ఆదిత్యరాయ్‌ కపూర్, శ్రద్ధా కపూర్‌ జంటగా రూపొందిన ‘ఆషికీ 2’ (2013) కూడా హిట్టయింది. ఇప్పుడు ‘ఆషికీ 3’లో కార్తీక్‌ ఆర్యన్‌ హీరోగా నటిస్తుండగా హీరోయిన్‌గా రషి్మకను ఓకే చేసినట్లు సమాచారం. ఈ చిత్రానికి అనురాగ్‌ బసు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రష్మిక నటించే విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.    

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top