
బేబీ మూవీతో సూపర్ హిట్ కొట్టిన జోడీ ఆనంద్ దేవరకొండ- వైష్ణవి చైతన్య. వీరిద్దరి క్రేజీ కాంబో మరోసారి రిపీట్ కానుంది. ఆనంద్, వైష్ణవి మరోసారి లవ్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా కొత్త సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం గ్రాండ్‌గా జరిగింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇవాళ హైదరాబాద్‌లో నిర్వహించిన పూజా కార్యక్రమానికి నేషనల్ క్రష్ రష్మిక మందన్నా క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఫోటోలను నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో పంచుకుంది.
ఈ కార్యక్రమంలో రష్మిక మందన్నా క్లాప్ కొట్టగా.. శివాజీ కెమెరా స్విచ్చాన్ చేయగా.. డైరెక్టర్స్ వెంకీ అట్లూరి. కళ్యాణ్ శంకర్ స్క్రిప్ట్ అందించారు. జూన్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని మేకర్స్ తెలిపారు. ఈ లవ్ స్టోరీకి ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు.
And it begins for the MOST RELATABLE LOVE STORY 😍@SitharaEnts Production No. 32 takes off with a pooja ceremony full of love ❤️
&
Regular shoot commences this June 🫶🏻
Clap by @iamRashmika
Camera Switch On by @ActorSivaji
Script handover by #VenkyAtluri & @kalyanshankar23… pic.twitter.com/POVPgdqhco— Sithara Entertainments (@SitharaEnts) May 15, 2025