రెమ్యూన‌రేష‌న్ రేటు పెంచిన ర‌ష్మిక‌

Rashmika Mandanna Charges 2 Cr Remuneration - Sakshi

అవ‌కాశం వ‌చ్చేంత‌వ‌ర‌కే పాకులాట‌లు. ఒక్క‌సారి అవ‌కాశం దొరికి స‌క్సెస్ అయ్యామంటే ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌దు. హీరోయిన్ల విష‌యంలో ఇది ఎన్నోసార్లు రుజువు అవుతూ వ‌స్తోంది. తాజాగా క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్నా పెద్ద మొత్తంలో రెమ్యూన‌రేష‌న్ డిమాండ్ చేస్తూ నిర్మాత‌ల‌కు షాకిస్తోంది. క‌న్న‌డ చిత్ర పరిశ్ర‌మ‌లో ల‌క్ష‌ల్లోనే పారితోషికం అందుకున్న ఈ భామ టాలీవుడ్‌కు మ‌కాం మార్చాక రేటు పెంచేసింది. తెలుగులో తొలి చిత్రం 'ఛ‌లో'తో ప్రేక్ష‌కుల‌ను బుట్ట‌లో వేసుకున్న ఈ బ్యూటీ ఆ త‌ర్వాత న‌టించిన 'గీతా గోవిందం' కూడా బంప‌ర్ హిట్ సాధించింది. దీంతో బ‌డా నిర్మాత‌ల నుంచి ఆఫ‌ర్లు ఆమెను వెతుక్కుంటూ వ‌చ్చాయి. (ఆ విషయం తెలిసి విస్తుపోయాం: పవన్‌)

అలా స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించే అవ‌కాశాన్ని కొట్టేసింది. దీంతో ర‌ష్మిక తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. అయితే గీతాగోవిందం స‌క్సెస్ వ‌ర‌కు ఆమె ఒక్క సినిమాకు రూ.50 ల‌క్ష‌లలోపే వ‌సూలు చేసింది. కానీ సంక్రాంతి బ‌రిలోకి దిగిన‌ మ‌హేశ్‌బాబు సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రం 'స‌రిలేరు నీకెవ్వ‌రు' విజ‌యానందంతో ర‌ష్మిక త‌న‌ రెమ్యూన‌రేష‌న్‌ను రెండు కోట్ల రూపాయ‌ల‌కు పెంచింద‌ట‌. తెలుగులో కొన్నేళ్లుగా సినిమాలు చేస్తున్న కొంద‌రు హీరోలు కూడా ఇంత పారితోషికం అందుకోక‌పోవ‌డం గ‌మనార్హం. కాగా ర‌ష్మిక ప్ర‌స్తుతం అల్లు అర్జున్ 'పుష్ప', శ‌ర్వానంద్ 'ఆడాళ్లూ మీకు జోహార్లు' చిత్రంలో న‌టిస్తోంది. (నమ్మలేకపోతున్నా.. రష్మిక ఎమోషనల్‌ ట్వీట్‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top