'నీ బంగారు నిన్ను దొంగ అంటోంది'.. ఆసక్తి పెంచుతోన్న ట్రైలర్ | Rangamarthanda Movie Trailer Released Today | Sakshi
Sakshi News home page

Rangamarthanda Movie : 'ఒంటరి జననం.. ఏకాకి మరణం.. నడుమంతా నాటకం.. జగన్నాటకం'

Published Mon, Mar 20 2023 7:15 PM | Last Updated on Mon, Mar 20 2023 7:17 PM

Rangamarthanda Movie Trailer Released Today - Sakshi

ప్రకాశ్‌రాజ్‌, బ్రహ్మానందం, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'రంగమార్తాండ'. దర్శకుడు కృష్ణవంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ఉగాది కానుకగా ఈనెల 22న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాను హౌల్‌ఫుల్‌​ మూవీస్, రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్​ బ్యానర్‌పై నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ విడుదల చేశారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

ఈ ట్రైలర్‌ చూస్తే కుటుంబంలో జరిగే సంఘటనలను కళ్లకు కట్టినట్లు చూపించినట్లు కనిపిస్తోంది. కుటుంబ నేపథ్యంలో సాగే ఎమోషన్స్, డైలాగ్స్‌ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతున్నాయి. ముఖ్యంగా రమ్యకృష్ణ-ప్రకాశ్ రాజ్​, బ్రహ్మానందం-ప్రకాశ్​ రాజ్ మధ్య సాగే ఎమోషన్స్‌ ఈ చిత్రంలో హైలెట్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రైలర్‌లో బ్రహ్మనందం సీరియస్ లుక్‌ సినిమాకే హైలెట్‌గా మారనుంది. జీవితంలో​ నటనను ప్రాణంగా భావించే ఒక రంగస్థల కళాకారుడి జీవిత అనుభవాలను సినిమాగా రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో శివాత్మిక రాజశేఖర్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌, ఆదర్శ్‌ బాలకృష్ణ తదితరులు కూడా ఈ చిత్రంలో నటించారు. ఇప్పటికే సినీ ప్రముఖుల కోసం ప్రీమియర్‌ షోను ప్రదర్శించగా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement