మా సినిమా చూడండి అంటూ బ‌స్టాండ్ల‌లో తిరిగిన హీరోహీరోయిన్లు | Ram Asur Movie Hero Abhinav Sardar, Heroine Chandini Different Promotions | Sakshi
Sakshi News home page

Ram Asur Movie: గోడ‌ల‌పై పోస్ట‌ర్లు అతికిస్తూ, సినిమా చూడండ‌న్న హీరోహీరోయిన్లు

Nov 16 2021 8:02 PM | Updated on Nov 16 2021 9:56 PM

Ram Asur Movie Hero Abhinav Sardar, Heroine Chandini Different Promotions - Sakshi

 "రామ్ అసుర్" హీరో అభినవ్ సర్దార్, హీరోయిన్ చాందిని మాత్రం త‌మ సినిమా చూడండి అంటూ జ‌నంలోకి వెళ్లి ప్ర‌చారం చేశారు. బస్టాండ్ లాంటి పబ్లిక్ ఏరియాల్లో తిరుగుతూ..

Ram Asur Movie Promotions: సినిమాను రూపొందించడం ఒకెత్తయితే దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. మరీ ముఖ్యంగా చిన్న సినిమాలపై ప్రేక్షకుల దృష్టి పడేలా చేసుకోవడం తప్పనిసరి! అయితే సినిమాను ప్రమోట్ చేసుకోవడంలో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. కొందరు భారీ ఏర్పాట్లతో పెద్ద పెద్ద ఈవెంట్స్ చేస్తుంటారు, ఇంకొందరు స్టార్ హీరోలతో టైటిల్, టీజర్ లాంచ్ లాంటివి చేస్తుంటారు. "రామ్ అసుర్" హీరో అభినవ్ సర్దార్, హీరోయిన్ చాందిని మాత్రం త‌మ సినిమా చూడండి అంటూ జ‌నంలోకి వెళ్లి ప్ర‌చారం చేశారు. బస్టాండ్ లాంటి పబ్లిక్ ఏరియాల్లో తిరుగుతూ రామ్ అసుర్ మూవీ గురించి వివరించారు. వాల్ పోస్టర్స్ కూడా స్వయంగా ఆ ఇద్దరే అంటించి ప్రమోషన్స్‌లో డిఫరెంట్ స్ట్రాటజీ చూపించారు.  

వెంక‌టేష్ త్రిప‌ర్ణ దర్శకత్వంలో అభిన‌వ్ స‌ర్ధార్‌, వెంక‌టేష్ త్రిప‌ర్ణ  సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న "పీనట్ డైమండ్" మాస్ ఆడియన్స్‌కు రీచ్ కావాలని చిత్ర టైటిల్‌ను `రామ్ అసుర్`గా మార్చారు. నవంబర్ 19న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు `బెంగాల్ టైగ‌ర్` ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement