Actor Rakhi Sawant’s Brother Arrested In an Old Cheque-Bouncing Case - Sakshi
Sakshi News home page

Rakhi Sawant: మాట తప్పడంతో బాలీవుడ్‌ నటి సోదరుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

May 9 2023 7:12 PM | Updated on May 9 2023 7:19 PM

Rakhi Sawant Arrested In Cheque Bounce Case - Sakshi

చెక్‌ బౌన్స్‌ కేసులో పోలీసులు అతడిని మే 7న అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం అతడిని జ్యుడీషియల్‌ కస్టడీలో ఉంచినట్లు తెలుస్తోంది. కాగా 2020లో ఓ వ్యాపారవేత్త చెక్‌ బౌన్స్‌ విషయంలో

బాలీవుడ్‌ నటి, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ రాఖీ సావంత్‌ ఈ ఏడాది ప్రారంభం నుంచి వార్తల్లో నిలుస్తూ ఉంది. మొదట్లో ఆమె తన బాయ్‌ండ్‌ అదిల్‌ దురానీని పెళ్లాడినట్లు చెప్పగా అతడు మాత్రం అలాంటిదేం లేదని అబద్ధమాడాడు. ఆ తర్వాత కొంతకాలానికే రాఖీతో ఏడాది క్రితమే పెళ్లి జరిగిందని అంగీకరించాడు. అంతలోనే వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. అవి కాస్తా తారాస్థాయికి చేరడంతో గృహహింస, చీటింగ్‌ కింద భర్తపై కేసు పెట్టింది నటి. తర్వాత అతడితో విడిపోతున్నట్లు ప్రకటించింది.

తాజాగా రాఖీ సావంత్‌ సోదరుడు, దర్శకనిర్మాత, రచయిత రాకేశ్‌ సావంత్‌ అరెస్టయ్యాడు. చెక్‌ బౌన్స్‌ కేసులో పోలీసులు అతడిని మే 7న అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం అతడిని జ్యుడీషియల్‌ కస్టడీలో ఉంచినట్లు తెలుస్తోంది. కాగా 2020లో ఓ వ్యాపారవేత్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాకేశ్‌పై చెక్‌ బౌన్స్‌ కేసు నమోదైంది. అప్పుడు కూడా జైలుకు వెళ్లిన రాకేశ్‌ ఆ డబ్బును తిరిగి ఇచ్చేస్తానని హామీ ఇచ్చి బెయిల్‌పై బయటకు వచ్చాడు. కానీ ఇంతవరకు ఆ డబ్బును తిరిగి చెల్లించకపోవడంతో మరోసారి అతడు జైలుపాలయ్యాడు.

చదవండి: ఆ హీరో మమ్మల్ని దారుణంగా మోసం చేశాడు: డైరెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement