'లాల్‌ సలాం' టీజర్‌ రిలీజ్‌.. మొయిద్దీన్‌ భాయ్‌గా మెప్పించిన రజినీకాంత్ | Rajinikanth Lal Salaam Teaser Released | Sakshi
Sakshi News home page

'లాల్‌ సలాం' టీజర్‌ రిలీజ్‌.. మొయిద్దీన్‌ భాయ్‌గా మెప్పించిన రజినీకాంత్

Published Sun, Nov 12 2023 2:25 PM | Last Updated on Sun, Nov 12 2023 2:42 PM

Rajinikanth Lal Salaam Teaser Released - Sakshi

రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లాల్‌ సలాం’. విష్ణు విశాల్‌, విక్రాంత్‌ సంతోష్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్‌ అతిథి పాత్రలో కనిపించనున్నారు.  జైలర్‌తో భారీ హిట్‌ అందుకున్న రజనీ కాంత్‌.. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న 'లాల్ సలామ్' చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. క్రికెట్ గేమ్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. తాజాగా లాల్‌ సలాం టీజర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు.

జైలర్‌తో సూపర్‌ హిట్‌ అందుకున్న రజనీకాంత్‌ ఈ చిత్రంలో ముస్లిం నాయకుడిగా కనిపించనున్నాడు. క్రికెట్‌తో మొదలైన గొడవలు సమాజంలో మతాల మధ్య చిచ్చుపెట్టేలా ఎందుకు మారాయి..? అనేది కథాంశం.

టీజర్‌లో రజనీ సీరియస్‌ లుక్‌లో కనిపించగా.. విష్ణు విశాల్‌ ఏదో గొడవలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.  క్రికెట్‌ ఆటతో ముడిపడి ఉన్న ఓ యాక్షన్‌ కథాంశంతో రూపొందిన చిత్రమిది. ఇందులో మొయిద్దీన్‌ భాయ్‌ అనే పాత్రలో రజనీకాంత్‌ చాలా పవర్‌ఫుల్‌గా కనిపించాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి లాల్‌ సలాం విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement