రజనీకాంత్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు

Rajinikanth To Be Honoured With 51st Dadasaheb Phalke Award - Sakshi

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కు అరుదైన గౌరవం దక్కింది. భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతి ఏడాది ఇచ్చే దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారాన్ని 2020 సంవత్సరానికిగాను సూపర్ స్టార్ రజనీకాంత్‌ని వరించింది. రజనీకాంత్‌కు 51వ దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును అందించనున్నట్లు తాజాగా కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్ వెల్లడించారు.

భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతి సంవత్సరం ఈ పురస్కారంతో గౌరవిస్తారు. భారతీయ సినిమాకు పితామహుడుగా భావించబడే దాదాసాహెబ్ ఫాల్కే జన్మ శతి సందర్భంగా 1963లో ఈ పురస్కారం ఏర్పాటు చేయబడింది. ఒక సంవత్సరానికి సంబంధించిన పురస్కారం మరుసటి ఏడాది చివర్లో ఇచ్చే జాతీయ సినిమా అవార్డులతో పాటు ఇస్తారు. తాజాగా ఈ అవార్డ్ ను రజని కాంత్ అందుకోవడం విశేషం.

అయితే తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారీ ఫాలోయింగ్‌ ఉన్న రజనీకాంత్‌కు కేంద్రం అవార్డు ప్రకటించడం ఎలక్షన్ స్టంట్ అని విపక్షాలు నేతలు విమర్శిస్తున్నారు.  రజని కాంత్ పార్టీ పెట్టి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నందుకు గిఫ్ట్‌గా ఈ అవార్డు ఇచ్చారని ఆరోపిస్తున్నారు.

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు:
రజనీకాంత్‌ ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్నందుకు గాను ఆయనకు పలువును సినీ రాజయకీ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రజనీకి శుభాకాంక్షలు తెలిపారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top