'నూరేళ్లు కాదు.. 130 ఏళ్లు'.. సుమకు రాజీవ్ బర్త్‌ డే విషెస్ | Rajeev kanakala special bithday wishes to his wife suma kanakala | Sakshi
Sakshi News home page

Rajeev Kanakala: '130 ఏళ్లు నువ్వు హ్యాపీగా ఉండాలి'.. సుమకు రాజీవ్ విషెస్

Mar 22 2026 12:22 PM | Updated on Mar 22 2026 12:22 PM

Rajeev kanakala special bithday wishes to his wife suma kanakala

టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కనకాలకు ఆమె భర్త ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. ఇవాళ సుమ బర్త్‌ డే కావడంతో సోషల్ మీడియా వేదికగా తన ప్రేమను వ్యక్తం చేశారు. తెలుగులో వేద మంత్రాన్ని రాస్తూ తన సతీమణికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.  నిండూ నూరేళ్లు… కాదు కాదు.. ఒక 120–130 ఏళ్లు మీ మనవలు, మనవరాళ్లతో హ్యాపీగా ఉండాలని దీవిస్తున్నానంటూ భార్యపై తన ప్రేమను చాటుకున్నారు రాజీవ్ కనకాల. ఇది చూసిన అభిమానులు సైతం సుమకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. 

కాగా.. రాజీవ్ కనకాల, సుమ 1999లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. ఇప్పటికే వీరిద్దరి కుమారుడు రోషన్ ‍టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అయితే వారి పరిచయం సీరియల్స్‌తోనే మొదలైంది. అలా ప్రేమలో పడిన ఈ జోడి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది. గతంలో ఓ సినిమా ఈవెంట్‌లో రాఘవేంద్రరావు మాట్లాడుతూ వారి పెళ్లి గురించి సరదా వ్యాఖ్యలు చేశారు. సుమ - రాజీవ్ కలిసి నటించిన సూపర్‌ హిట్‌ సీరియల్‌ 'శాంతి నివాసం' సీరియల్‌తోనే వారి మధ్య ప్రేమ చిగురిందని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement