
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం 'ఆచార్య'. ఇందులో చిరు తనయుడు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే తాజాగా జరిగిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకధీరుడు రాజమౌళి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'మగధీర' టైమ్‌లో చిరంజీవిగారు కథ విన్నారు. అప్పుడు రామ్ చరణ్ విషయాలన్నీ దగ్గరుండి చిరంజీవిగారే చూసుకుంటారేమో అని అనుకున్నాను. కానీ చరణ్‌కి చిరంజీవిగారు ఎటువంటి సలహాలు ఇవ్వరని నాకు తెలిసింది. చరణ్ నువ్వు ఇలా చెయ్ అలా చెయొద్దు అని చెప్పరు. ఈ సినిమాలో నీ యాక్టింగ్ బాగుంది, నీ యాక్టింగ్ బాలేదని చెప్పరు. ఇప్పటి వరకు తను చేసినవన్నీ చరణ్ తన సొంతంగా నేర్చుకున్నాడు.
తను తప్పులు చేస్తే తనే సరిదిద్దుకున్నాడు. డైరెక్టర్లు చెప్పిన దాని నుంచి ప్రతీది నేర్చుకుని తనకు తానుగా ఎదిగాడు. మెగాస్టార్ కొడుకైనా హార్డ్ వర్క్ చేసి ఎదిగాడు. ఇది నాకు కొత్తగా తెలిసింది. ఇలానే ఉండు చరణ్ నువ్వింకా ఎదుగుతావు. ఆయనంత కాకపోయినా తనకు సమానంగా ఉంటావు ఫ్యూచర్‌లో అని నేను కష్చితంగా చెప్పగలనంటూ జక్కన్న పేర్కొన్నాడు.
ఇక మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ నాకు ఆయనలోని కాంపటేటివ్‌నెస్ నచ్చింది. పక్కన ఉన్నది ఆయన కొడుకైనా కూడా నేనే డామినేట్ చేయాలని చిరంజీవి కోరుకుంటారు. ఆ లక్షనం చూడటానికి చాలా చూడ ముచ్చటగా ఉంటుంది. ఒక అభిమానిగా చిరంజీవి గారే బాగ చేసారని అనిపిస్తారు. కానీ ఒక డైరెక్టర్‌గా నాకు నా హీరోనే మీకంటే బెటర్ సర్ అనడంతో రాజమౌళితో పాటు పక్కనే ఉన్న మెగాస్టార్ సైతం నవ్వుకున్నారు.