
Raj Tarun Starrer Stand Up Rahul Movie Press Meet In Hyderabad: 'ఉయ్యాల జంపాల' చిత్రంతో హీరోగా పరిచయమై మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు రాజ్ తరుణ్. ప్రస్తుతం 'స్టాండప్ రాహుల్' సినిమాలో నటిస్తున్నాడు. శాంటో మోహన్ వీరంకి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా నటిస్తోంది. నందకుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీకి 'కూర్చుంది చాలు' అనేది క్యాప్షన్. ఈ సినిమా మార్చి 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించింది చిత్రబృందం. 'మా రెండేళ్ల ప్రయాణం ఈ చిత్రం. ఇందులో చక్కటి వినోదంతోపాటు మంచి ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. నాకు రోల్‌కు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. వాటిని బ్యాలెన్స్ చేస్తూ, నా కుటుంబాన్ని చూసుకుంటూ స్టాండప్ కామెడీ ఎలా చేశాననేదే ఈ సినిమా కథ.' అని హీరో రాజ్ తరుణ్ తెలిపాడు.
అలాగే దర్శకుడు శాంటో మోహన్ వీరంకి మాట్లాడుతూ 'నా జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ కథ రాసుకున్నా. సినిమా వాళ్లకు, బ్యాచిలర్స్‌కు హైదరాబాద్‌లో ఇల్లు దొరకడం చాలా కష్టం. ఇవి మూవీలో హీరో పాత్రతో చెప్పించాను. ఈ చిత్రానికి సంగీతం, సాహిత్యం చక్కగా కుదిరాయి.' అని అన్నారు. స్టాండప్ రాహుల్ చిత్రం తనకే కాదు, తన టీమ్ మొత్తానికి మంచి గుర్తింపు తెస్తుందని హీరోయిన్ వర్ష బొల్లమ్మ చెప్పుకొచ్చింది. థియేటర్లలో సినిమా చూసి ఆడియెన్స్ నవ్వులతో బయటకొస్తారని నమ్మకముందని పేర్కొంది.